Friday, May 17, 2024
- Advertisement -

శ‌బ‌రిమ‌ళ ఆల‌యంలో ఉద్రిక్త‌త‌

- Advertisement -

శ‌బ‌రిమ‌ళ ఆల‌యప్ర‌వేశంపై ద‌శాబ్దాలుగా ఉన్న చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు ఇద్ద‌రు మ‌హిళ‌లు. బిందు, కనకదుర్గ అనే ఇద్ద‌రు మ‌హిళ‌లు అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకుని చ‌రిత్ర సృష్టించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్తత ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ తెల్లవారుజామున 3.45 గంటలకు అయ్యప్ప స్వామికి దర్శించుకుని ప్రార్థనలు చేసిన అనంతరం వెనుతిరిగారు.

మహిళల ప్రవేశంతో ఆలయ అపవిత్రం అయ్యిందంటూ.. ఆలయాన్ని పూజారులు మూసివేశారు. సంప్రోక్షణ( ఆలయం శుద్ధి చేయడం) తర్వాత తిరిగి ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకు సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -