Sunday, May 19, 2024
- Advertisement -

తోకపత్రిక సర్వే…….. టిడిపి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో కూడా 2019లో ఎన్నంటే?

- Advertisement -

చంద్రబాబుతో సహా టిడిపి నేతలు అందరూ ఎంతలా బుకాయించినప్పటికీ విషయం అయితే మాత్రం 70ఎంఎం రేంజ్‌లో చాలా క్లియర్‌గా జనాలకు కనిపిస్తోంది. తీవ్రస్థాయిలో ఉన్న ప్రజావ్యతిరేకతను మొత్తం బిజెపిపైకి, మోడీపైకి నెట్టేసి, మోడీ ఏదో చేస్తున్నాడు అని ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ 2019 ఎన్నికల్లో టిడిపి ముఖచిత్రంలో ఏ మార్పూ ఉండబోదని ప్రజలు మరోసారి తేల్చేశారు. చంద్రబాబుపైన వ్యతిరేకత తనను కూడా ముంచేస్తుందని తెలివిగా తప్పుకున్న పవన్ కళ్యాణ్ భయాలు నిజమే అని ఇప్పుడు ప్రజలు కూడా తేల్చేశారు.

Also Read: సెన్సేషనల్ సర్వే

చంద్రబాబు మోడీకి దూరమయ్యాక, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దూరమయ్యాక ప్రజల్లో టిడిపి పట్ల స్పందన ఎలా ఉంది? 2019లో కూడా చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారా? అన్న విషయాలపై తాజాగా తన భజన మీడియా సంస్థల్లో టాప్ రేంజ్‌లో ఉండే తోక పత్రిక యజమానికి చెప్పాడు చంద్రబాబు. వెంటనే ఆ బూతు మీడియా అని చెడ్డపేరు తెచ్చుకున్న ఆ సంస్థ యజమాని రంగంలోకి దిగిపోయాడు. అక్కడా ఇక్కడా ఎందుకు? టిడిపికి అత్యంత ఎక్కువ పట్టు ఉన్న అనంతపురంలో సర్వే చేయాలని నిర్ణయించుకున్నాడు. 2014 ఎన్నికల్లో 14 సీట్లకు గాను 12 స్థానాల్లో టిడిపిని గెలిపించారు అనంత ప్రజలు. అయితే 2019 ఎన్నికల్లో అదే అనంత ప్రజలు టిడిపిని ఎన్ని సీట్లలో గెలిపిస్తారో తమ సొంత సర్వే లో తెలుసుకున్న ఆ మీడియా సంస్థ యజమానికి, ఆయనతో పాటు చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయిందని టిడిపి నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. 2019లో అనంతపురం జిల్లాలో కేవలం మూడు సిట్లలోనే టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయట. ఇప్పుడు ఇదే టిడిపిలో హాట్ టాపిక్ అయింది. సొంత వర్గం జనాభా, పార్టీ పుట్టినప్పటి నుంచీ పట్టున్న జిల్లాలోనే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంటే ఇక మిగతా జిల్లాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదని టిడిపి నేతలే భయంగా చెప్పుకుంటున్నారు. అనంతపురంలోనే దాదాపు పది సీట్లు కోల్పోయే పరిస్థితి ఉందంటే 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కలలో మాట అన్నది టిడిపి నాయకుల ఆందోళన. సొంత భజన మీడియా సర్వే ఫలితాలు అయితే చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తాయనడంలో సందేహం లేదు. ఎలా అయినా 2019లో అధికారంలోకి రావాలనుకుంటున్న నారావారి అడుగులు ఇక నుంచీ ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -