Saturday, May 18, 2024
- Advertisement -

రాహుల్ చిన్న పిల్లాడు.. అతడికేం తెలియదు!

- Advertisement -

చివరికి కేజ్రీవాల్ కూడా అనేశాడు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అనుకోని చేసినా.. అనుకోకుండా చేసినా.. అసలు ఏం చేసినా.. తిరిగి ఆయనకే మిస్ ఫైర్ అవుతోంది. రీసెంట్ గా… ఓ చిట్ చాట్ లో కేంద్రాన్ని కడిగిపారేద్దామనుకున్న రాహుల్ కు.. షాకిచ్చారు స్టుడెంట్స్. కేంద్రం చేపడుతున్న స్వచ్ఛ్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాలకు ఓపెన్ గా మద్దతు తెలిపారు.

ఇప్పుడు.. మరోసారి రాహుల్ చేసిన కామెంట్లు.. ఆయనకే రిటర్న్ పంచ్ వచ్చేలా చేశాయి. ఢిల్లీలోని షకూర్ బస్తీలో.. రైల్వే అధికారులు దాదాపు వెయ్యికిపైగా గుడిసెలు కూలగొట్టిన విషయం వివాదంగా మారుతోంది. ఇందులో తప్పు ఎవరిదన్న విషయం పక్కన పెడితే.. నాయకుల మధ్య జరుగుతున్న గొడవ సైడ్ ట్రాక్ లో పోతోంది.

వాస్తవానికి గుడిసెలు తొలగించింది రైల్వే అధికారులు కాబట్టి.. ఆ విషయం కేంద్రం పరిధిలోకి వెళ్తుందంటూ ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ ఆమ్ ఆద్మీ వాదిస్తోంది. పార్లమెంట్ ఎదుట కూడా ధర్నా చేసింది. ఇదే టైమ్ లో.. కాస్త దూకుడు చూపిద్దామని ట్రై చేసిన రాహుల్.. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై కామెంట్లు చేశారు.

అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీనే కదా. పార్లమెంట్ దగ్గర గొడవ చేయాల్సిన అవసరం ఏంటంటూ.. రాహుల్ గాంధీ విమర్శించారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెటకారంగా బదులిచ్చారు. రాహుల్ చిన్నపిల్లాడు.. రైల్వేలు కేంద్రం పరిధిలోకి వస్తాయన్న విషయం కూడా అతనికి పార్టీ నేతలు చెప్పినట్టు లేరు.. అంటూ ట్వీట్ చేశారు.. కేజ్రీ.

కేజ్రీ కామెంట్లతో రాహుల్ గాంధీ కాస్త నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. కాస్త ఆలోచించుకుని కామెంట్లు చేస్తే మంచిదంటూ యువనేతకు సన్నిహితులతో పాటు.. కాంగ్రెస్ అభిమానుల నుంచి సలహాలు వెళ్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -