Saturday, May 18, 2024
- Advertisement -

నాలుగేళ్ళ తర్వాత…… పవన్ వ్యూహం తెలిసి ముందుగానే చంద్రబాబు స్కెచ్ వేశాడా?

- Advertisement -

నాలుగేళ్ళ పాటు చంద్రబాబుని, టిడిపి ప్రభుత్వాన్ని పొగిడిన పవన కళ్యాణ్‌కి ఇప్పుడు సడన్‌గా జ్ఙానోదయమైందా అని ప్రతిరోజూ మీడియా మీట్స్‌లో పవన్‌ని నిలదీస్తున్నాడు చంద్రబాబు. అయితే ఇక్కడ చంద్రబాబు కూడా అలాంటి ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశ్న. అదే నాలుగేళ్ళపాటు నరేంద్రమోడీని పొగిడిన చంద్రబాబుకు……హోదా వేస్ట్……ప్యాకేజ్ బెస్ట్ అన్న చంద్రబాబుకు…….వెంకయ్య, జైట్లీలకు సన్మానాలు చేసిన చంద్రబాబుకు……అసెంబ్లీ సాక్షిగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ ఇచ్చింది…….ఇస్తోంది అని చెప్పి కృతజ్ఙతాభినందన తీర్మానాలు పంపించిన చంద్రబాబుకు మాత్రం ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత సడన్‌గా జ్ఙానోదయమైందా అన్నదే ఆ ప్రశ్న. ఆ ప్రశ్నకు చంద్రబాబు ఎప్పటికీ సమాధానం చెప్పడు. చెప్పలేడు. ఇక చంద్రబాబువి, పవన్‌వి కూడా పక్కా ఎన్నికల ఏడాది పొలిటికల్ డ్రామాలే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారని పొలిటికల్ సర్వేలు తేల్చిచెప్తున్నాయి.

ఆ విషయాలు పక్కన పెడితే చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి గురించి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తబోతున్నాడని, నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్నవి అన్నీ నిజాలే అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా నిరూపించబోతున్నాడని చంద్రబాబుకు ముందే తెలుసన్నది తాజా ఖబర్. అజ్ఙాతవాసి సినిమా రిలీజ్‌కి ముందు నుంచీ చూస్తే మహేష్ కత్తి ఎపిసోడ్‌లోనూ, అజ్ఙాతవాసి సినిమా విషయంలోనూ టిడిపి మీడియా, టిడిపి కార్యకర్తలు కూడా పూర్తిగా పవన్‌కి వ్యతిరేకంగా వ్యవహరించారు అన్నది కంటికి కనిపిస్తున్న సాక్ష్యం. టివి9, ఆంధ్రజ్యోతి లాంటి పక్కా టిడిపి భజన మీడియా సంస్థలు మహేష్ కత్తిని అడ్డుపెట్టుకని పవన్‌ ఇమేజ్‌ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. ఇక దమ్ము, బాద్షాలాంటి సినిమాల టైంలో ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దని బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపించిన తరహాలోనే అజ్ఙాతవాసి సినిమా రిలీజ్ టైంలో కూడా పవన్‌కి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలకు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపించారు. అదే టైంలో రిలీజ్ అయిన బాలయ్య సినిమా సోసోగా ఉన్నప్పటికీ టిడిపి జనాలు మాత్రం ఆ సినిమాకు హైప్ తీసుకురావాలని చూశారు. అదే టైంలో అజ్ఙాతవాసి సినిమాపై విష ప్రచారం చేశారు. ఒకవైపు చంద్రబాబు అన్నీ కూడా పవన్ సినిమాకు అనుకూలంగా చేస్తున్నట్టుగా కనిపించాడు. కానీ తెరవెనుక మాత్రం పవన్ చుట్టూ ఉన్న తన మనుషుల ద్వారా ముందుగానే ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని…….తనపై విమర్శలు చేయకముందే పవన్ ఇమేజ్‌ని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయించాడు చంద్రబాబు. ప్రజారాజ్యం పార్టీని పరకాల ప్రభాకర్‌ని అడ్డుపెట్టుకుని పూర్తిగా అణిచేశాడు చంద్రబాబు. ఇప్పుడు జనసేన విషయంలో కూడా అదే చేశాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు తనను దెబ్బకొట్టిన విధానం తెలిశాక పవన్ ఇంకా ఆవేదన చెందాడు అన్నది పవన్ సన్నిహితుల మాట. వాడుకుని వదిలేయడం అనే బాబు కాన్సెప్ట్ గురించి తెలిసి ఉన్నప్పటికీ మరీ ఈ స్థాయిలో ఉంటుంది అని మాత్రం ఊహించలేకపోయాడట. 2014ఎన్నికల్లో బాబుకు సపోర్ట్ చేసినప్పటికీ ……జగన్‌కి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ జగన్ మాత్రం ఎప్పుడూ పరిధి దాటి తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేయలేదని…….కానీ చంద్రబాబుకు మాత్రం అలాంటి విలువలు ఏమీ లేవని……అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడని తన సన్నిహితుల దగ్గర వాపోయాడట. అయితే రాజకీయ మేధావులు, జర్నలిస్టులు మాత్రం ఈ విషయంలో పవన్ పైనే సెటైర్స్ వేస్తున్నారు. చంద్రబాబు తత్వం గురించి పవన్ చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడని……చంద్రబాబు చేసిన స్వార్థ రాజకీయాల గురించి, కుట్ర రాజకీయాల గురించి పవన్ కాస్త ముందు మేలుకుని ఉంటే రాష్ట్రానికి కూడా మంచి జరిగి ఉండేదని పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -