Saturday, May 4, 2024
- Advertisement -

బాబు దెబ్బ………. ఆంధ్రప్రదేశ్‌పై మరో కోలుకోలేని దెబ్బ…

- Advertisement -

విభజన పుణ్యమాని పూర్తిగా నష్టపోయిన ఎపిని మోడీతో కలిసి తాను ఉద్ధరిస్తానని చెప్పి 2014లో ఓట్లేయించుకున్నాడు బాబు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరకపోగా ఇప్పటికే తన భారాన్నే ఎపి తట్టుకోలేని స్థాయిలో ఖర్చులు పెంచేశాడు బాబు. ఇక యనమల లాంటి పన్ను నొప్పి ఖర్చులు తెలుసుకుని ఎపి ప్రజలు హతాశులయ్యారు. అలాగే ఐదు దశాబ్ధాల కాలంలో ఎపి ప్రజలపైన రుద్దిన అప్పుల భారం కంటే కేవలం నాలుగేళ్ళలో అంతకుమించిన అప్పుల భారాన్ని మోపాడు చంద్రబాబు. ఇక ఇప్పుడు మరో పెనుభారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోపనున్నాడు చంద్రబాబు. ఓటుకు నోటు కేసు దెబ్బతో తెలంగాణా నుంచి ఎపికి రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనాన్ని గట్టిగా అడగలేని స్థితిలో పడిపోయిన చంద్రబాబు……. పదేళ్ళు అధికారం ఉన్నప్పటికీ ఓటుకు కోట్లు కేసులో బుక్ చెయ్యకుండా ఉండడం కోసం కేసీఆర్‌కి ఇచ్చిన హామీ మేరకు ఆదరాబాదరాగా హైదరాబాద్ వదిలి విజయవాడ వెళ్ళాడు.

ఇప్పుడిక కేసీఆర్‌పై రివేంజ్‌కి ప్లాన్ చేస్తున్నాడు బాబు. తెలంగాణాలో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి ముఖ్యమంత్రి పదవిని నిర్ణయించే స్థాయిలో సీట్లు గెలవాలనుకుంటున్నాడు. అలాగే కాంగ్రెస్‌ని గెలిపించాలనుకుంటున్నాడు. ఎన్నికలకు అవసరమయిన కోట్లాది రూపాయల సొమ్ము మొత్తం ఆంధ్రప్రదేశ్‌ నుంచే చంద్రబాబు తరలించనున్నాడని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ లెక్కన చూస్తే సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి సీమాంధ్రను సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ని గెలిపించడం కోసం ఇప్పుడు ఎపి ప్రజల సొమ్మును తెలంగాణాలో ఖర్చు చేయనున్నాడు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీని ఎలా అయినా గెలిపించాలి, కెసీఆర్‌ని ఓడించాలి అన్న వ్యూహంతో తెలంగాణా ఎన్నికల వ్యూహరచన చేయనున్న చంద్రబాబు……….కాంగ్రెస్‌కి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వనున్నాడు. ఇప్పుడు ఈ విషయంపైనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యక్తిగత కేసుల పుణ్యమాని విభజన తర్వాత తెలంగాణా నుంచి రావాల్సిన ప్రయోజనాలు రాలేదు. ఇప్పుడిక తనను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌ని ఓడించడం కోసం………విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌ని గెలిపించడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు వ్యూహరచన చేయడం, ఆంధ్రప్రదేశ్ డబ్బును తెలంగాణా ఎన్నికల్లో ఖర్చు చేయడాన్ని మాత్రం ఆర్థికవేత్తలు ఆక్షేపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -