టెలికం రంగంలో సంచలనం సృష్టించింది రిలయన్స్ జియో. అదిరిపోయే ఆఫర్స్ ఇస్తూ ఎక్కువ మందిని సంపాధించుకుంటుంది. ఫ్రీ కాలింగ్ ఆఫర్‌తో టెలికామ్ రంగంలో జియో సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. జియో దెబ్బకు ఇతర టెలికామ్ కంపెనీలన్నీ కుదేలయ్యాయి.
ఆత్మరక్షణలో పడి రోజుకో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాయి. మిగిలిన టెలికం కంపెనీలు అన్నీ ఈ దెబ్బ నుంచి కోలుకుంటున్నాయో లేదో వెంటనే జియో మరో దిమ్మతిరిగే ఆఫర్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. వెల్ కం ఆఫర్ గడువు ఇంకో నెలలో అయిపోతుండటంతో.. ఈ ఆఫర్ ఏకంగా ఏడాది పాటు పొడిగించే ఆలోచనలో జియో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఈ ఆఫర్ పొడిగింపు ప్రకటన ఉంటుందని సమాచారం.
సో ఈ లెక్కన చూస్తే ఉచిత సర్వీస్‌తో పాటు వెల్‌కమ్ ఆఫర్ కూడా 2017 సంవత్సరం చివరి వరకు ఉంటుందని చెబుతున్నారు. ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా ఇటీవల ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం రూ.149 రీచార్జ్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతో పాటు ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని ఆర్‌కాం ప్రకటించింది. సో మొత్తం మీద అన్నదమ్ములిద్దరి ప్రకటనలతో మిగిలిన టెలికం కంపెనీలకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
Related