Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు..

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇక రాష్ట్రంలో శుక్రవారంతో రాత్రి పూట కర్ఫ్యూ ముగియనుంది. కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి ఈ రోజు కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరపాల్సి ఉంది. సీఎస్‌తో పాటు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ, హోంశాఖ అధికారులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ డెడ్‌లైన్ విధించింది. 45 నిమిషాల్లో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. అయితే నైట్ కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపింది. ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉందని హైకోర్ట్ సీరియస్ అయింది.

24 గంటల సమయం ఇచ్చినా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మే 8 వరకు అమల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 9 తర్వాత ఎవరూ బయట తిరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ఇంట్లో ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన నటి ప్రగతి.. వీడియో వైరల్!

కన్నీరు పెట్టుకున్న సోనుసూద్..!

కరోనాని కూడా రాజకీయం చేస్తున్న తండ్రీ కొడుకులు : విజయ్ సాయిరెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -