Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు.. ఒంటి గంట వరకు అనుమతి!

- Advertisement -

రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ పొడిగింపు, కరోనా తీవ్రత, కరోనా ట్రీట్‌మెంట్ మొదలైన విషయాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మే 12 నుంచి మే 21 వరకు లాక్‌డౌన్ విధించింది.

అయితే లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా? అని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రజల భద్రత దృష్ట్యా మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 9 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేబినెట్‌లో నిర్ణయించారు. గతంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఉండటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకో లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచాలని పలు విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దాంతో లాక్‌డౌన్ మినహాయింపు సమయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పెరిగింది. అంటే 6 గంటల నుంచి 1 గంట వరకు అయితే.. ఒంటి గంట అయినప్పటికీ రెండు గంటల వరకు అందరూ ఇంట్లో ఉండో విధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. పరిమితంగా వాణిజ్య కార్యకలాపాలకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర యాంకర్.. ఎవరంటే?

ఆనందయ్య మందుపై స్పందించిన చిన జీయర్ స్వామి

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -