Monday, May 6, 2024
- Advertisement -

ఫేస్‌బుక్ ద్వారా ఈ కుర్రాడు ఎంత సంపాదించాడో తెలుస్తే షాకే

- Advertisement -
Facebook is giving Kerala youth Arun S Kumar Rs. 10.70 Lakhs

ఫేస్‌బుక్‌.. ఇప్పుడు పెద్ద నెట్ వర్క్.. ఇందులో కొత్త ప‌రిచ‌యాలు పెంచుకోవచ్చు.. అలానే మన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్న తెలుసుకోని మళ్లీ పరిచయాలు చేసుకోవచ్చు. అయితే ఈ ఫేస్‌బుక్‌ వల్ల చాలా ఉపయోగాలు ఉన్న.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అదే పని గా యువత దీనిపై కూర్చుని టైం వేస్ట్ చేస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

అయితే ఇందుకు బిన్నంగా.. ఓ 21 ఏళ్ళ కుర్రాడు..త‌న‌కున్న తెలివితేట‌ల‌ను మ‌రింత పెంచుకునేందుకు , పెరిగిన మేధాశ‌క్తిని ప‌రీక్షించుకునేందుకు ఈ ఫేస్‌బుక్‌ను ఉప‌యోగించాడు. దాంతో లక్షలు సంపాధించాడు. అది ఎలానో తెలియాలంటే.. అరుణ్ గురించి తెలుసుకోవాల్సిందే. కేర‌ళ‌లోని ఛ‌త్త‌నూర్ ప్రాంతినికి చెందిన మామూలు మధ్య తరగతి అబ్బాయి ఈ అరుణ్ ఎస్ కుమార్‌. ఇంజ‌నీరింగ్ ఫూర్తి చేసిన అరుణ్.. కోడింగ్ రాయటంలో పెద్ద దిట్ట. అందులోనూ బ‌గ్స్ క‌నిపెట్టడం అంటే అరుణ్‌కి చాలా ఇష్టం. ఫేస్‌బుక్‌ను వాడీ వాడీ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ అంశాల‌కు, త‌న తెలివితేట‌లు జ‌త చేశాడు. అంతే అనుకున్నదే తడువుగా ఫేస్‌బుక్‌లో గ‌ల బ‌గ్స్‌ని క‌నిపెట్టట‌మే కాకుండా వాటి గురించి ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్‌కు వివ‌రించాడు. అరుణ్ తెలివితెటలు చూసిన.. ఫేస్‌బుక్.. అరుణ్ చెప్పిన బ‌గ్స్ ఫిక్స్ చేయ‌ట‌మే కాకుండా.. అతని ప్ర‌శంసించి.. 10.70ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో స‌న్మానించింది. ఈ విధంగా ప‌లు బ‌గ్స్‌ని క‌నిపెట్టి అరుణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఫేస్‌బుక్ నుండి 30.85ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదించాడు.

{loadmodule mod_custom,GA2}

ఇదిలావుంటే లాస్‌వెగ్గాస్‌లో జ‌రిగే ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్ నిర్వ‌హించే మీటింగ్‌కు హాజ‌రు కావ‌ల్సిందిగా ముగ్గురుకి ఆహ్వానం రాగా అందులో అరుణ్ ఒక‌డు. ఇదంతా ఓ ఎత్తైతే.. వైట్ హ్యాట్ హ్యాక‌ర్స్ ఫేస్‌బుక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అరుణ్ 10వ స్థానంలో నిల‌వ‌టం మ‌రో ఎత్తు. ఎందుకంటే.. ఈ స్థానాన్ని సంపాదించిన తొలి భార‌తీయుడు అరుణ్ ఎస్ కుమార్‌.

{youtube}Gn5cNeTjr9w{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. భార‌త్‌లోడౌన్‌లోడ్స్‌లలో ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టేసిన ట్రూకాల‌ర్‌
  2. ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..
  3. సుమ వయసులో ఎంతో తెలుసా..? సినిమాలకు ఎందుకు దూరం..?
  4. ప్రగతి, రమ్యకృష్ణ వయసు ఎంతో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -