Sunday, May 19, 2024
- Advertisement -

భార‌త్‌లోడౌన్‌లోడ్స్‌లలో ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టేసిన ట్రూకాల‌ర్‌

- Advertisement -
Truecaller 8.13 APK Download in India

మొబైల్‌ డిస్‌ప్లేపై గుర్తు తెలియని నంబర్‌ కనిపించిందటే.. యూజర్లు ట్రూకాలర్‌ యాప్‌ను ఆశ్రయించడం పెరిగిపోతోంది. ఈ కమ్యూనికేషన్‌ యాప్‌కు ఇటీవల భారత్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. ఎంతలా అంటే.. గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లు పొందిన యాప్‌ల జాబితాలో ఫేస్‌బుక్‌ను అదిగమించి ట్రూకాలర్‌ దూసుకెళ్తోంది.

మ‌న‌కు తెలియ‌ని నెంబ‌రు నుంచి మ‌న సెల్‌ఫోన్ కి కాల్ వ‌స్తే దాన్ని ఎవ‌రు చేశారో తెలుసుకొనేందుకు అవ‌కాశం ఉండేదికాదు.అలాగే, గుర్తు తెలియ‌ని నెంబ‌రు నుంచి కాల్ వ‌చ్చి అవ‌త‌లి వ్య‌క్తి త‌నను తాను త‌న‌ అస‌లు పేరుతో కాకుండా వేరే పేరుతో ప‌రిచ‌యం చేసుకుని మాయ‌మాట‌లు చెబితే మోసపోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇటువంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు వ‌చ్చిందే ట్రూకాలర్ యాప్‌. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే గుర్తు తెలియ‌ని నెంబ‌రు నుంచి ఫోన్ వ‌చ్చినా ఆ కాల్ చేస్తున్న వారి పేరు ఏంటో మ‌నం తెలుసుకోవ‌చ్చు ఇప్పుడు భారత్‌లో ఈ యాప్‌ దూసుకుపోతోంది.

{loadmodule mod_custom,GA2}

ఎంత‌గా అంటే ఫేస్‌బుక్‌ను అత్య‌ధికంగా ఉప‌యోగించే భార‌తీయులు ఆ యాప్‌ను మించి ట్రూకాల‌ర్ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. దీంతో ట్రూకాల‌ర్ భార‌త్‌లో ఫేస్‌బుక్ ను మించేసింది. అంతేకాదు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌లలో వాట్స‌ప్‌, మెసెంజర్, షేర్‌ఇట్‌లు మొద‌టి మూడు స్థానాల్లో ఉంటే ట్రూకాల‌ర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ యాప్‌ల‌న్నింటినీ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉప‌యోగించుకోవ‌చ్చు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -