Tuesday, May 21, 2024
- Advertisement -

నాలుగేళ్ళ అన్యాయాన్ని బాగానే సమర్థించుకున్నారు….. అణచివేత మాటేంటి?

- Advertisement -

‘కేంద్రం సాయం చేయకపోవడంపై తొలినుంచే నేను దూకుడుగా వెళ్ళి ఉంటే …… ‘సిఎం కాస్త ఓపిక పట్టి …..నెమ్మదిగా రాష్ట్ర ప్రయోజనాలు రాబట్టుకుని ఉంటే బాగుండేది. దూకుడు ప్రదర్శించి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశారు…’ అని మీరే అనేవారు. అందుకే నాలుగేళ్ళపాటు కేంద్రానికి సాగిలపడి ఉన్నాం అని చంద్రబాబు అఖిలపక్ష నేతలతో గొప్పగా చెప్పుకున్నారు. బాగుంది…..నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదు? కేంద్రం అన్యాయం చేస్తున్నప్పటికీ ఎందుకు మోడీ భజన చేస్తూ మోడీ దగ్గర సాగిలపడ్డారు? అసెంబ్లీ సాక్షిగా మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్పగా ప్రయోజనాలు చేకూర్చుతున్నాడని ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది…….. లాంటి ఎన్నో ప్రశ్నలకు, విమర్శలకు సమాధానంగా తనను సమర్థించుకుంటూ గొప్పగా మాట్లాడాడు చంద్రబాబు.

కాకపోతే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో కోణాన్ని బాబు ఎలా సమర్థించుకుంటారు? ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌తో సహా, ప్రజా సంఘాల నాయకులు, యువత అందరూ కూడా ఉద్యమం చేయడానికి ఉపక్రమిస్తే ఉక్కుపాదంతో ఎందుకు అణచివేసినట్టు? ప్రత్యేక హోదా వేస్ట్……..ప్యాకేజీనే బెస్ట్ అని చెప్పి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించాలిన, మోసం చేయాలని ఎందుకు ప్రయత్నం చేసినట్టు? మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రహ్మాండంగా సాయం చేస్తున్నాడని చెప్పి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులాంటి వాళ్ళకు సన్మానాలు ఎందుకు చేసినట్టు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలడా?

నాలుగేళ్ళుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉన్నానని చంద్రబాబే పరోక్షంగా ఒప్పుకున్నాడు. దానికి తనకు తోచిన కారణాలు కూడా చెప్పుకుంటున్నాడు. మరి మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని చెప్పి, హోదా కోసం నిరాహారదీక్షతో సహా ఎన్నో ఆందోళనా కార్యక్రమాలు చేసిన జగన్‌పైన, ప్రజా సంఘాల నాయకులపైన, యువతరంపైన కేసులు ఎందుకు నమోదు చేసినట్టు? హోదా ఉద్యమాలను ఎందుకు ఉక్కు పాదంతో అణచివేసినట్టు అనే ప్రశ్నలకు బాబు దగ్గర సమాధానం ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -