Tuesday, May 21, 2024
- Advertisement -

మీరు వెతికే వెబ్సైట్ డేంజరో కాదో.. ఇలా తెలుసుకోండి !

- Advertisement -

నేటి రోజుల్లో మనం చేసే ప్రతి పని కూడా ఇంటర్నెట్ పై ఆధారపడే చేస్తూ ఉంటాం. ఎన్నో రకరకాల వెబ్సైట్స్ ను వెతకడం. వాటి ద్వారా మనకు అవసరమైన సమాచారాన్ని గ్రహించడం వంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏదైనా వెబ్సైట్ ను వెతకడానికి ఎక్కువ మంది సెర్చ్ చేసే బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఈ మొబైల్ యాప్ ను ప్రతిఒక్కరూ సెర్చ్ చేస్తూ ఉంటారు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బ్రౌజింగ్ కొరకు ఎక్కువమంది యూస్ చేసే యాప్ కూడా క్రోమ్ బ్రౌజరే.

అయితే ఈ క్రోమ్ బ్రజర్ ను ఉపయోగించి ఎన్నో వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. అయితే ఆ వెబ్సైట్స్ ఎంతవరకు సేఫ్ అనే విషయాన్ని మాత్రం గ్రహించం ఫలితంగా మొబైల్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. దాంతో మన ప్రైవసీ సమాచారం అంతా కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే మనం వెతికే వెబ్సైట్ సేఫ్ యేనా లేదా ఆ వెబ్సైట్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనేది తెలుసుకోవాలి. అలా ఒక వెబ్సైట్ ఎంతవరకు సేఫ్ అనేది గూగుల్ క్రోమ్ బ్రజర్ ద్వారా తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం !

ముందుగా క్రోమ్ బ్రజర్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత మనం వెతికే వెబ్సైట్ ను ఎంటర్ చేయాలి వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత రైట్ సైడ్ లో పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తరువాత పైన కనిపించే ” i ” బటన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనం ఓపెన్ చేసిన వెబ్ సైట్ సెక్యూర్ గా ఉందా లేదా అనేది చూపిస్తుంది. మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ సేఫ్ అయినది అయితే సెక్యూర్ అని చూపిస్తుంది. లేదా “ఆన్ సెక్యూర్ ” అని చూపిస్తుంది. అలాగే ఆ వెబ్సైట్ కు ఏమేమి పర్మిషన్ ఇచ్చాము అనేది కూడా అక్కడే చూపిస్తుంది.

ఇలా మనం వెతికే వెబ్సైట్ సెక్యూర్ గా ఉందా ? లేదా అని తెలుసుకొని హ్యాకర్స్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

ఇవి కూడా చదవండి

వాట్సప్ ద్వారా గ్రూప్ కాల్స్ చేయండిలా !

మొబైల్ స్పీకర్ లో దుమ్ము చేరితే.. ఇలా చేయండి !

పాత మొబైల్ లోని డేటా.. కొత్త మొబైల్ లో పొందండిలా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -