Sunday, May 19, 2024
- Advertisement -

ఇంట్లోనే ఫేషియల్ తయారు చేసుకుందామా?

- Advertisement -

ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఫేషియల్ చేసుకోవటం ఎలా అంటే… ముందుగా శనగపిండితో ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.

ఆ తర్వాత, ఐస్‌ వాటర్‌ లో ముంచిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి. అటు తర్వాత, వేడి నీళ్లలో చిటికెడు పసుపు,కొంచెం వేపాకు వేసి ఆవిరి పెట్టి దానికి తేనె,పెరుగు సమ పాళ్లలో కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. దీనికి ముందుగానే చక్రాల రూపంలో తరిగిన కీరదోస ముక్కలను కళ్లపై ఒక  20 నిమషాల పాటు ఉంచుకోవాలి.

తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. పచ్చి బంగాళాదుంపను తురిమి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే స్ట్రింజెంట్‌లా పని చేస్తుంది. బాదం పప్పు పొడి, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -