Saturday, May 4, 2024
- Advertisement -

వీసా లేక పోతే 11 ఏళ్లు జైలు శిక్ష.. తీరా ఇంటికి వచ్చాక అంతా మరుపు..!

- Advertisement -

ఉత్తర్​ప్రదేశ్​లో అదృశ్యమైన ఓ వ్యక్తి 11ఏళ్ల తర్వాత సొంతూరికి వచ్చాడు. ఇన్నేళ్లూ పాకిస్థాన్​లో జైల్లో గడిపిన పున్వాసి.. ఎట్టకేలకు మిర్జాపుర్​కు చేరుకున్నాడు. అయితే.. జ్ఞాపకశక్తి మందగించిన అతడు.. కనీసం తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులనూ గుర్తించలేని స్థితిలో ఉండటం.. అక్కడి వారిని కలచివేస్తోంది. ఈ తరుణంలో పున్వాసి మళ్లీ ఇల్లు వదిలి వెళతాడేమోననే భయంతో.. రాత్రంతా అతడికి కాపలాగా ఉన్నా కుటుంబం.

కొత్వాలి ప్రాంతానికి చెందిన పున్వాసి.. 2009లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 11 ఏళ్ల పాటు పాక్​ జైల్లోనే నరకం అనుభవించిన అతడు.. ఎట్టకేలకు ఈ నెల 5న ఇంటికి చేరుకున్నాడు. అతడి తల్లిదండ్రులు, ఐదుగురు అన్నదమ్ములు చనిపోయారు. అతడి గుడిసె కూలిపోయింది. ఒక్కగానొక్క సోదరి కిరణ్​ దేవి.. లాల్​గంజ్​ బహుతిలోని వాళ్ల బంధువుల ఇంట్లో ఉంటోంది. తన సోదరుడు వచ్చాడనే వార్త తెలియగానే.. ఎంతో సంతోషించింది. అయితే.. మతిస్తిమితం సరిగాలేని అతడిని కలవగానే ఆ ఆనందం కాస్తా ఆవిరై.. తీవ్ర విచారానికి లోనైందామె.

అయితే.. పున్వాసి చిరునామాకు సంబంధించి సరైన వివరాలు దొరక్క… భారత అధికారులు అతడ్ని రక్షించేందుకు చాలా సమయమే పట్టింది. ఐదేళ్ల క్రితమే అతడి చిరునామా కోసం.. వారణాసి జిల్లా కలెక్టర్​కు ఓ లేఖ రాగా.. అది సరికానిదిగా భావించి వెనక్కిపంపారు. 2019 ఫిబ్రవరి 6న మరోసారి ఆరా తీయగా.. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్​ 1న మిర్జాపుర్​లోని అతడి నివాసాన్ని గుర్తించారు అధికారులు. అనంతరం.. నవంబర్​ 17న అతడ్ని భారత్​కు అప్పగించింది పాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -