పిల్లలు లేని.. కొందరు దంపతులు పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకోంతమంది అయితే తమకు అబ్బాయే కావాలని కోరుకుంటారు. అయితే ఈ విషయంలో ఓ వెబ్‌సైట్‌లో ఓ ఆసక్తికర కథనం హల్‌చల్ చేస్తోంది. టిబెట్ మెడిసిన్ ఎడ్యూ.ఆర్గ్ అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం.. బేసి దినాల్లో శృంగారంలో పాల్గొంటే పండంటి మగ పిల్లాడు పుట్టడం ఖాయమట. అదే సరి దినాల్లో సెక్స్ చేస్తే ఆడపిల్ల పుడుతుందట. ఈ కథనం ప్రకారం రుతుక్రమం మొదలైన తొలి మూడు రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి.
తర్వాత నాలుగో రోజును ఒకటో రోజుగా పరిగణించి 1, 3, 5, 7, 9 రోజుల్లో దంపతులు శారీరకంగా కలవడం వల్ల మగబిడ్డ జన్మిస్తాడట. పదకొండో రోజు మాత్రం అమ్మాయి పుడుతుందట. మిగితా సరి దినాల్లో సెక్స్ చేసినా.. ఆడపిల్ల పుడుతుందట. ఈ విషయాన్ని చారిత్రక టిబెట్ గ్రంథాల్లోనూ పొందురపర్చారట. సంప్రదాయ టిబెటన్ వైద్యం ప్రకారం ఇది సత్యంమని కొందరు అంటున్నారు. దీన్ని భారతీయ పండితుడైన జరాంధర, లోత్సవ రించెన్ సాంగ్‌పొలు 11వ శతాబ్దంలో టిబెటన్ల భాషలోకి తర్జుమా చేశారట. ఏ రోజుల్లో శారీరకంగా కలిస్తే మగబిడ్డ జన్మిస్తాడో విషయమై ఇప్పుడు టిబెట్లో మరో ఆచారం కూడా ఉంది.
అది కూడా బేసి సంఖ్యల కాన్సెప్టే కాకపోతే.. రుతుస్రావమైన తొలి మూడు రోజులపాటే కాకుండా పదకొండు రోజులపాటు కూడా శృంగారం చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు. కాబట్టి రుతుస్రావం మొదలైన 14వ నాటి నుంచి సెక్స్‌లో పాల్గొంటే పిల్లలు పుట్టే అవకాశాలుంటాయి. 14వ రోజును 1గా, 16వ రోజును 3గా భావించి.. 1, 3, 5 7, 9 రోజుల్లో శారీరకంగా ఒక్కటయితే మగబిడ్డ జన్మిస్తాడట. అదే 2(రుతుక్రమం వచ్చాక 15వ రోజు), 4, 6, 8 రోజుల్లో సెక్స్ చేస్తే అమ్మాయి జన్మిస్తుందంట.
Related