Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీలో ఆ పార్టీకి 7 శాతం తగ్గ‌నున్న ఓట్లు?

- Advertisement -

ఏపీలో 2014 జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో అధికారంలోకి వ‌చ్చింది టీడీపీ పార్టీ. అనేక ఎన్నిక‌ల హామీల‌తో అధికారం చెప‌ట్టింది తెలుగుదేశం పార్టీ. ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌నుకున్న వైఎస్ఆర్‌సిపి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది. అధికార టీడీపీ పార్టీకి, ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్‌సిపి మ‌ధ్య ఓట్ల తేడా చాలా త‌క్కువుగా ఉంది. కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో అధికారానికి దూరం అయింది వైఎస్ఆర్‌సిపి. అయితే ప్ర‌స్తుత టీడీపీ పార్టీకి గ‌డ్డుకాలం నడుస్తుంది. చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని స‌మాచారం. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కూడా చంద్ర‌బాబు మాట‌మార్చిన సంగ‌తి తెలిసిందే. ఇక రైతులు చంద్ర‌బాబుని న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తుంది.

తాజ‌గా టీడీపీ నాయ‌కులు చేయించిన స‌ర్వేలో టీడీపీకి 7 శాతం ఓట్లు తగ్గ‌నున్న‌యాని స‌మాచారం. దీనిని క‌వ‌ర్ చేసుకుని వైఎస్ఆర్‌సిపికి ఓట్ల శాతం ప‌డిపోయింద‌ని ప‌బ్లిసిటి చేస్తున్న ,లోలోనా మాత్రం ఎవ‌రు గెలుస్తారో ,ఎవ‌రు ఓడిపోతారో అని భ‌యంతో ఉన్నారు టీడీపీ నాయ‌కులు. ఎన్నిక‌ల స‌మ‌యానికి చంద్ర‌బాబు ఏదో ఒక‌టి చేస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. ప్ర‌జ‌సంక‌ల్ప‌యాత్ర‌తో జ‌గ‌న్ ఇమేజ్ బాగా పెరిగింద‌ని,ప్ర‌జ‌ల‌లో చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పోయింద‌ని,ఈ న‌మ్మ‌కాన్ని జ‌గ‌న్‌పై ఉంచుతున్నార‌ని టీడీపీ నాయ‌కులే స్వ‌యంగా మాట్లాడుకోవడం విశేషం. ఇక జ‌న‌సేన పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ద‌ని 4 సీట్ల‌లో పోటాపోటి ఉంటుంద‌ని టీడీపీ వారు చేయించిన సర్వేలో తేలింద‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -