Sunday, May 19, 2024
- Advertisement -

మోడీపై వైకాపా, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ భారీ పోరుబాట…. బాబు మద్దతిస్తాడా?

- Advertisement -

చివరి బడ్జెట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిప్పే చూపించింది. 2014-19 కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజననాటికంటే ఎక్కువే నష్టపోయింది. ఇక చంద్రబాబు మోడీతో సానుకూలంగా ఉండి చేసేది ఏమీ లేదు. ఇప్పటి వరకూ చేసింది కూడా ఏమీ లేదు. ప్రజా పోరాటం మినహా మరో మార్గం లేదు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచీ కూడా పచ్చ మీడియా, టిడిపి బ్యాచ్ అంతా కూడా మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఏదో పోరాటాం చించేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి తెగ తాపత్రయపడుతోంది. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు మాత్రం బడ్జెట్‌కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కానీ పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, అగ్రహోదగ్రుడవుతున్నాడు……బాబు దెబ్బకు మోడీ బెంబేలెత్తిపోతున్నాడు అని సినిమా రేంజ్ కథలను ఆసక్తికరంగా వండి వారుస్తోంది.

అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం వచ్చింది. వైకాపా, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ఉన్న మేధావులు, వివిద సంఘాలన్నీ కూడా మోడీ అన్యాయానికి వ్యతిరేకంగా రేపు బంద్ చేస్తున్నాయి. తెలంగాణా రాష్ట్ర పోరాటం సమయంలో రాజకీయ పార్టీలు, పౌర సమాజం అంతా కూడా ఒక్క తాటిపై నిలబడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఆ ఛాన్స ఉంది. ఒక్క రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ బంద్ పాటించారంటే దేశవ్యాప్తంగా ఆ విషయం చర్చనీయాంశం అవుతుంనడంలో సందేహం లేదు. అసలే ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలతో మోడీ ఇమేజ్ మసకబారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోడీ నమ్మించి మోసం చేసిన వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయితే అది కచ్చితంగా మోడీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతం కావాలంటే మాత్రం కచ్చితంగా చంద్రబాబు మద్దతివ్వాలి. లేకపోతే బాబు భజన మీడియా అంతా కూడా రేపు ఉదయం నుంచే బంద్ అట్టర్‌ఫ్లాప్ అని చెప్పేస్తుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచివేసినట్టుగానే చంద్రబాబు ఈ బంద్‌ని కూడా అణిచివేస్తాడు అనడానికి సందేహించక్కర్లేదు.

కెసీఆర్ పోరాటం కంటే కూడా తెలంగాణా పౌర సమాజం మొత్తం బంద్‌లు, ఆందోళనలు చేయడంతోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే తెలంగాణాలో కనీసం పోటీ చేయలేం అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకుంది అన్నది నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బంద్ కూడా సంపూర్ణంగా సక్సెస్ అయితే మాత్రం మోడీకి కూడా అదే భయం తప్పకుండా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల కంటే ముందుగానే న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. మోడీ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా……వేరే ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా కూడా ఓట్లు పడవు అన్న భయం కలిగిందంటే మాత్రం కచ్చితంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటారన్నది నిజం.

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు అయినా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలకు మద్దతిస్తాడా? లేక 144 సెక్షన్స్ పెట్టి అణిచివేస్తాడా? పచ్చ మీడియా ఇప్పుడు కూడా బాబు ప్రయోజనాల కోసం పనిచేస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసం కట్టుబడుతుందా? రేపటి బంద్‌తో ఎవరి చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు కూడా చంద్రబాబు……ఈ బంద్‌ల వళ్ళ ప్రయోజనం లేదు, పోరాటం చేస్తున్నవాళ్ళకు చిత్తశుద్ధి లేదు, చేతైనతే ఢిల్లీలో చేయండి అంటూ గోడమీద పిల్లిలా వ్యవహరించి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకున్నవాళ్ళను అరెస్ట్‌లు చేయించడం, 144 సెక్షన్ విధించడం, పచ్చ మీడియా చేత బంద్ అట్టర్ ఫ్లాప్ అని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడంటే మాత్రం రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలకు చంద్రబాబు చేసిన మూడో ద్రోహం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -