Thursday, May 16, 2024
- Advertisement -

వైఎస్‌ను ఫాలో అవుతున్న మోదీ…

- Advertisement -

రెండ‌వ సారి అధికారంలోకి రావాల‌ని ఎన్‌డీఏ త‌హ‌త‌హ‌లాడుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే బ‌డ్జెట్ రూపొందించార‌న‌డంలో సందేహంలేదు. అందుకే బ‌డ్జెట్‌లో గ్రామీణ ప్రాంతానికి పెద్ద‌పీట వేశారు . మ‌రో సారి అధికారంలోకి రావ‌లంటే దానికి త‌గ్గ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాలి. రెండో సారి అధికారంలోకి రావ‌డం అంత ఈజీ కాద‌నేది తెలిసిందే. తాజాగా ప్ర‌ధాని మోదీ కూడా అధికారంలోకి రావ‌డానికి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అనుస‌రించిన ఫార్ములానే అనుస‌రించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

బ‌డ్జెట్‌లో మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబాలు, రైతుల‌ను దృష్టిలో పెట్టుకొనే బ‌డ్జెట్ రూపొందించామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల ఆరోగ్యోనికి పెద్ద‌పీట వేశారు మోదీ. ఈ హెల్త్ స్కీమ్ ఒక్క‌టి చాలు మ‌రో సారి అధికారంలోకి రావ‌డానికి. ఆరోగ్య‌భీమా ప‌థ‌కంలో ఒక్కో కుటుంబానికి సంవ‌త్స‌రానికి రూ.5 ల‌క్ష‌లు ఆరోగ్య‌భీమా వ‌ర్తిస్తుంది.

ఈ ప‌థ‌కం చూస్తుంటే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆరుగ్య‌శ్రీ ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టి దీని ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత‌వైద్యాన్ని అందించిన మ‌హానేత వైఎస్ఆర్‌. అదే ప‌థ‌కం రెండో సారి వైఎస్ఆర్‌ను కుర్చీలో కూర్చోబెట్టింది. ఆరోగ్య‌శ్రీ వ‌ల్ల రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఎంత‌టి గుర్తింపు వ‌చ్చిందో అంద‌రికి తెలిసిందే. మ‌రీ మోదీ కూడా ఆలానే గుర్తింపు తెచ్చ‌కుంటారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -