Saturday, April 20, 2024
- Advertisement -

మీ న‌డుము చుట్టూ కొవ్వును త‌గ్గించుకోలేకపోతున్నారా? అయితే..

- Advertisement -

ఈ ఉరుకుల ప‌రుగుతు జీవితంలో మారుతున్న ఆహార‌పు అలవాట్ల కార‌ణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది అధిక బ‌రువు పెర‌గ‌డం. అయితే, ఒక్కోసారి బ‌రువు త‌గ్గ‌డానికి నెల‌ల త‌ర‌బ‌డి ఎన్ని వ్యాయామాలు చేసిన‌, ఆహారంలో తీసుకోవ‌డంతో మార్పులు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌దు. న‌డుము, పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోతూ ఉంటుంది.

ఇలా జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం హ‌ర్మోన్ల ప్ర‌భావం, వాటి లోపం కావ‌చ్చున‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే జీవ క్రియ‌ల‌ను నియంత్రించి, ఒత్తిడి ఆక‌లి వంటి శారీర‌క చ‌ర్య‌ల‌ను ఇవి క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తాయి. ఇలా హ‌ర్మోన్ల కార‌ణంగా నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే స‌మ‌స్య‌ను హ‌ర్మోన‌ల్ బెల్లీ అంటారు. ఇలా జ‌ర‌గ‌డానికి అనేక ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. దీని బారిన మీరు కూడా ప‌డ్డార‌ని గుర్తించ‌డానికి కొన్ని సూచ‌న‌లు..

అధిక ఒత్తిడి కార‌ణంగా గుండె వేగం, ర‌క్త‌పోటు, చ‌క్కెర స్థాయిలో పెరుగుతాయి. ఇది బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అలాగే, ఆహారం తీసుకున్న‌ప్ప‌టికీ భోజ‌నం చేసిన భావ‌న ఉండ‌కపోవ‌డం వంటి ల‌క్ష‌ణాల కూడా హ‌ర్మోన‌ల్ బెల్లీ ల‌క్ష‌ణంగా ఉంటుంది. తిపి ప‌ద‌ర్థాలు ఎక్క‌వ‌గా తీసుకోవ‌డం కూడా హ‌ర్మోన‌ల్ బెల్లీకి కార‌ణం అవుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో అధికంగా కావ‌డం కూడా దీనికి సంబంధించిన ల‌క్ష‌ణమే. అలాగే, తొడ‌లు, పిరుదులు, పొత్తిక‌డుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతున్న‌ట్టు అనిపిస్తే.. నిపుణులు స‌ల‌హాలు తీసుకోవ‌డం ఉత్త‌మ‌మైన ప‌ని.

15యేళ్ల త‌ర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ‌!

మిస్సెస్ ఇండియా పోటీల్లో స‌త్తా చాటిన తెలుగు యువ‌తి !

ఎన్టీఆర్ తో త‌ల‌బ‌డుతున్న విజ‌య్ సేతుపతి !

ప్రియుడితో చిందేస్తున్న శృతి హాస‌న్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -