Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ సైలెన్స్ కు కారణం ఇదే(నా?)!

- Advertisement -

కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది. ఇలాంటి సమయంలో.. కాపు నేతలను ఒక్కటి చేసిన ఘనత.. ముద్రగడ దీక్షకే దక్కింది.

దాసరి నారాయణరావు, చిరంజీవితో పాటు.. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చేలా చేసిన ఘనత.. నిస్సందేహంగా ముద్రగడకే దక్కుతుంది. కానీ.. ఇంతలా ఒక్కటి అయిన ఈ నాయకులంతా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాత్రం తమతో కలుపుకోలేకపోవడం.. రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. 

కాపులకు ప్రతినిధిగా పవన్ ను భావిస్తున్న తలపండిన నాయకులు కూడా.. ఈ విషయంలో అందరితో అతడిని ఒక్కటి చేయలేకపోయారు. ఇందుకు కారణాలేంటా అని ఆరా తీస్తే.. ఓ వార్త వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బాగా నమ్మే వ్యక్తుల్లో.. ఒక అనుభవజ్ఞుడే.. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉంటే మంచిదని పవన్ కు సూచించినట్టు తెలుస్తోంది. ముద్రగడకు మద్దతుగా.. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. పొరపాటున ఒక్క మాట నోరు జారినా.. కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ముద్ర పడే అవకాశం ఉందంటూ.. పవన్ ను ఆ అదృశ్య శక్తి వారించినట్టు వినిపిస్తోంది. అందుకే.. పవన్ కనీసం మాట కూడా మాట్లాడడం లేదనీ.. ఆఖరికి సోషల్ సైట్లలో కూడా స్పందించడం లేదనీ అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇందులో నిజం ఎంతో.. అబద్ధం ఎంతో ఎవరికీ తెలియకపోయినా.. ముద్రగడ దీక్షకు సంబంధించి ఏమీ మాట్లాడొద్దంటూ పవన్ ను నిజంగా ఎవరైనా వారించి ఉంటే.. ఆ వ్యక్తి ఎవరు.. రాజకీయంగా పవన్ కు ఎందుకు సలహా ఇస్తున్నారు.. ఇది కూడా చంద్రబాబు సృష్టేనా.. లేదంటే.. పొలిటికల్ పవర్ గా ఎదిగేందుకు పవన్ నిజంగానే ఎవరి సూచనలనైనా ఫాలో అవుతున్నాడా? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్నలే.. చాలా మందిని సమాధానం దొరకక ఆలోచనలో పడేస్తున్నాయి. కానీ.. ఏదో ఒక సమయంలో.. వీటన్నిటికీ.. జవాబు దొరికి తీరుతుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -