Monday, May 6, 2024
- Advertisement -

రక్త‌క‌న్నీరు….

- Advertisement -
seven year old suffers fromblood tears

శ‌రీరానికి ఏగాయం క‌ళ్లు, చెవులు, చ‌ర్మం నుంచి రక్తం కార‌డం వంటి దృశ్యాలు సాధార‌ణంగా మ‌నం హ‌ర్ర‌ర్ సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో అయితే క‌ల్ల‌లోనుంచి రాల్లు , మేకులు రావ‌డం చేశాం. కానీ ఇప్పుడు క‌ళ్ల‌నుంచి ర‌క్తం కార‌డం వింటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. ఇది జ‌ర‌గింది థాయ్‌లాండ్‌లో.

థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అప్పుడప్పుడు ఆమె కంటి నుంచి, ముక్కు నుంచి, చెవుల నుంచి, చేతుల నుంచి ఎలాంటి గాయం లేకుండానే రక్తం ధారలుగా కారుతోంది. గత ఆర్నెల్లుగా ఆ పాపది ఇదే పరిస్థితి. అప్పుడప్పుడు తలనొప్పి రావడం, అలా వచ్చినప్పుడల్లా కళ్ల నుంచో, చెవుల నుంచో, చేతుల చర్మం నుంచో రక్తం కారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దానంతట అదే రక్తం కారడం ఆగిపోతుంది. స్థానికంగా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమె జబ్బు నయం కావడం లేదు. ఈ పరిస్థితి నుంచి తమ పాపను కాపాడాలని ఆమె తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ప్రపంచంలో ఇంతకుముందు కూడా ఇలాంటి మూడు, నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో ఏదో భాగంలో రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారుతుంది. దీన్ని ‘హెమటోహైడ్రాసిస్‌’ అని వైద్య నిపుణులు పిలుస్తున్నారు. ఈ జబ్బు కోటి మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి తన కూతురు ధైర్యవంతురాలని, శరీర భాగాల నుంచి రక్తం కారుతున్నా ఇప్పటికీ ఆమె ధైర్యం సడలలేదని, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందని ఆ పాప తల్లి నిపాపర్న్‌ కాంటేన్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు మూడు, నాలుగు వైద్యుల దృష్టికి వచ్చినా వారు ఇప్పటి వరకు ఈ జబ్బుకు మందు కనుక్కోలేక పోయారు. కనీసం ఎందుకు వస్తుందో కూడా కారణం తెలుసుకోలేకపోయారు. అయితే మానసిక ఒత్తిడి తగ్గించే ‘బేటా బ్లాకర్స్‌’ మందుల వల్ల ఉపశమనం లభించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత టెక్నాల‌జీ అభివృద్ధిచెందినా కొన్ని వ్యాధుల‌కు మాత్రం మందుల క‌నుక్కోలేక‌పోతున్నారు శాల్త్ర‌వేత్త‌లు.

Related

  1. ప్ర‌త్యేక‌హోదాకు దిక్కులేదు గాని.. ఆస్కార్ అవార్డు అవసరమా..
  2. ఆర్టీసీని కేశినేని నానికో, జేసీ దివాకర్ రెడ్డి… మ‌రి సీఎం సీటు లోకేష్‌కా బాబు
  3. జగన్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎక్క‌డ బాబు…?
  4. నంద్యాల ఉపఎన్నిక సినిమాలో బ‌ల‌య్యేది అఖిల‌ప్రియానా…శిల్పానా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -