Friday, May 17, 2024
- Advertisement -

చ‌ద‌వు కోసం క‌న్య‌త్వం తాక‌ట్టు

- Advertisement -

ఏవైనా ప‌నులు, స్థిరాస్తి, చిత్రాలు, వ‌జ్రాలు, అరుదైన వ‌స్తువులు వేలానికి పెట్ట‌డం చూసి ఉంటాం…చూస్తుంటాం. ఏళ్ల నాటి విస్కీ, మందు బాటిళ్లు వేలం నిర్వ‌హిస్తారు. చివ‌రికి గ‌ణేశ్ న‌వ‌రాత్రుల్లో పూజా సామ‌గ్రి వేలం నిర్వ‌హిస్తుండ‌డం చూస్తుంటాం. కానీ ఓ యువ‌తి త‌న క‌న్యత్వాన్ని వేలం పెట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. అది బ‌హిరంగంగా సామాజిక మాధ్య‌మంలో వేలం పెట్టింది. ఆ క‌న్య‌త్వం రూ.కోట్ల‌లో ప‌లికింది కూడా. న‌మ్మ‌లేని వాస్త‌వం నిజంగా జ‌రిగింది. అమెరిక‌న్ యువ‌తి గిసెల్లీ జ‌ర్మ‌నీ దేశానికి సిండ్రిల్లా ఎస్కార్ట్స్ అనే వెబ్‌సైట్ ద్వారా త‌న శీలాన్ని అమ్మ‌కానికి పెట్టింది. ఆమె వేలానికి విశేష స్పంద‌న ల‌భించింది.

వేలాది మంది పోటీ ప‌డ్డారు. చివ‌రికి అబుదాబీకి చెందిన బ‌డా వ్యాపార‌వేత్త 2.5 మిలియ‌న్ యూరోల‌కు కొంటాన‌ని ముందుకు వ‌చ్చాడు. క‌న్య‌త్వాన్ని విక్ర‌యించిన గిసెల్లీ అబుదాబీకి వెళ్లేప్పుడు ఎందుకు త‌న క‌న్య‌త్వాన్ని విక్ర‌యించానో తెలిపింది. త‌న క‌న్య‌త్వ విక్ర‌యం ద్వారా వ‌చ్చిన డ‌బ్బును త‌న యూనివ‌ర్సిటీ చ‌దువు ట్యూష‌న్ ఫీజుగా చెల్లిస్తాన‌ని చెప్పింది. క‌న్య‌త్వ విక్ర‌యం ద్వారా త‌న క‌ల నిజ‌మ‌వుతుంద‌ని గిజిల్లీ సంబ‌ర‌ప‌డిపోతుంది.

గ‌తంలో కూడా ఇలాంటి వేలాలు చాలా జ‌రిగాయి. ఇలాంటి వేలం పాటలు పాశ్చాత్య దేశాల్లో కొత్త ట్రెండ్ ఇది. దీనిపై ఆ దేశంలో యువ‌తులు య‌మ ఆస‌క్తిగా ఉన్నారు. గ‌తంలో రుమెనియాకు చెందిన అలెగ్జాండ్ర కెపిన్ కూడా వేలంలో ఓ భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. జ‌ర్మ‌నీకి చెందిన సిండ్రిల్లా ఎస్కార్ట్స్ అనే వెబ్‌సైట్ ఆ ప‌నుల కోసమే పని చేస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -