Sunday, May 5, 2024
- Advertisement -

ఫేషియల్​ స్కానర్​ కరోనాను పట్టేస్తోంది..!

- Advertisement -

ఇప్పటికా సరైన చికిత్స లేని కరోనాను అరికట్టాలంటే.. అనేక దేశాలు టీటీటీ (ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీటింగ్​) అనే విధానాన్నే అమలు చేస్తున్నాయి. కరోనా ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో తెలిసిన విషయమే. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ వారి శరీరంలో కరోనా వైరస్​ ఉంటుంది. ఇటువంటి వారు వారికి తెలియకుండానే వ్యాధిని వ్యాపింపజేస్తారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు కరోనాను గుర్తించేందుకు పలు కొత్త ప్రక్రియలను తీసుకొస్తున్నాయి.

ప్రస్తుతం ఎయిర్​పోర్ట్స్​, షాపింగ్ మాల్స్​లో టెంపరేచర్​ చెక్​ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లక్షణాలు బయటపడని వారి ఈ టెస్ట్​కు చిక్కరు. దీంతో యూఏఈ రాజధాని అబుదాబిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా పేషెంట్స్​ను గుర్తంచేందుకు ఫేషియల్ స్కానర్లను ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాల ద్వారా ఈ యంత్రం కరోనా రోగులను పసిగడుతోంది.

మనిషి శరీరంలో కరోనా వైరస్​ ఉందా? లేదా? అన్న విషయాన్ని ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్​ ఉన్నట్టు తేలితే.. వారికి వెంటనే ఆర్​టీపీసీఆర్​ టెస్ట్ చేస్తున్నారు.

Also Read

కోవాగ్జిన్​ భేష్… ప్రభావశీలత 77.8

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం మా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -