Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు.. జగన్ ఒత్తిడితోనే బాబు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి

- Advertisement -

వైఎస్ జగన్ సారథ్యంలోని వైకాపా రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా రాష్ట్రం కోసం రాజీనామాలు, ఉద్యమ పంథాను జగన్ ప్రకటించడంతో చంద్రబాబు కూడా ఏదో ఒకటి చేయకతప్పని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తిస్థాయిలో ఆందోళన నెలకొని ఉంది. ఆ నేపథ్యంలో జగన్‌వైపు పూర్తిగా ప్రజలు టర్న్ అవ్వకుండా ఉండాలంటే చంద్రబాబు కూడా ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి.

ఇవీ ఆర్కే మార్క్ కామెంట్‌లో కొన్ని వ్యాఖ్యలు. ఇక వ్యాసమంతా కూడా చంద్రబాబు తోపు, బాబు తురుంఖాన్…..బాబు తల్చుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే 2019ఎన్నికల తర్వాత మోడీకి చంద్రబాబు జాతీయ స్థాయిలో పోటీ అవుతాడనడంలో సందేహం లేదు. చంద్రబాబు ఏం చేసినా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే. ఆ విషయాన్ని ఎపి ప్రజలు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. రాష్ట్రానికి మోడీ ఏం చేయకపోవడానికి జగనే కారణం. రాజీనామాల నిర్ణయం కూడా డ్రామానే. జగన్‌ది పూర్తిగా స్వార్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి జగన్ అస్సలు పాటుపడడం లేదు లాంటి రొటీన్ వ్యాఖ్యాలు కూడా బోలెడన్ని ఉన్నాయి కానీ జగన్‌కి బాబు భజన మీడియా, బాబు ఆంతరంగీకుడు అయిన రాధాకృష్ణ ఇచ్చిన సర్టిఫికెట్స్ మాత్రం ప్రజల్లో ఉన్న కొన్ని సందేహాలను తీర్చేశాయి అనడంలో సందేహం లేదు.

విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేసిన జగన్‌పై సోనియాతో కుమ్మక్కయి రాష్ట్ర విభజనకు కారణమయ్యాడని విషయం చిమ్మింది ఇదే భజన మీడియా, చంద్రబాబులే. ఇప్పుడు మాత్రం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంద్రలో ఉన్న పార్టీలన్నీ పోరాడాయని చెప్పుకొచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర కోసమే ఫైట్ చేశాడు అని అబద్ధం చెప్పాడనుకోండి. చంద్రబాబు గురించి రాధాకృష్ణ అలా చెప్పకపోతే ఇంకెలా చెప్తాడు. కాకపోతే జగన్ సమైక్యాంధ్ర కోసం పోరాడాడు అన్న నిజాన్ని నాలుగెళ్ళ తర్వాత అయినా ఒప్పుకోవడం మాత్రం గొప్ప విషయమే. ఇక టిడిపి జనాలు, పవన్ కళ్యాణ్, ఇతర భజన మీడియా సంస్థలు విభజనకు జగనే కారణం అన్న అబద్ధాన్ని చెప్పకుండా ఉంటాయేమో చూడాలి.

అలాగే ఇంకో గొప్ప విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు ఆర్కే. ఎంపిల రాజీనామాలు, ఢిల్లీలో ధర్నా, ఎపిలో ఆందోళనల పోరాట పంథాను జగన్ ప్రకటించడంతోనే చంద్రబాబుకు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని జనాల ముందు కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ఒప్పేసుకున్నాడు ఆర్కే. అయితే ఇక్కడ కూడా తనదైన శైలిలో బాబుకు సపోర్ట్ చేస్తూ మరో మాట కూడా చెప్పాడు. జగన్ రాజనీమాల వళ్ళ ఏమీ ఉపయోగం లేదని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా కెసీఆర్ రాజీనామాల వళ్ళ తెలంగాణా రాలేదని కూడా చెప్పాడు. కానీ పచ్చ కళ్ళ జోడు తీసి ఆర్కే చూడాల్సిన ఒక నిజం ఏంటంటే కెసీఆర్ రాజీనామాల వళ్ళే ఉద్యమం సజీవంగా ఉన్నది. ప్రజల్లో పోరాడాలన్న చైతన్యం పెరిగిపోతూ వచ్చింది. ఆ ప్రజల ఓట్ల కోసమే సోనియా తెలంగాణా ఇచ్చింది అన్నది నిజం. అలాగే జగన్ పార్టీ ఎంపిల రాజీనామాలు, ఢిల్లీ వేదికగా ధర్నాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలతోనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రం కోసం చేస్తున్న ఆ ఆందోళనలను అణచకుండా ఉంటే ఆ వేడి ఢిల్లీకి తెలుస్తుంది. మన నాయకులు అందరూ కూడా ఓట్ల కోసమే నిర్ణయాలు తీసుకుంటారు అన్నది నిజం. ఆ స్థాయిలో ప్రజా స్పందన వచ్చినప్పుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయమే రాగా లేనిది…….విభజన చట్టంలో ఉన్న ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్‌కి రావా? ఇది సరైన మార్గమా కాదా అన్న విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫైవ్ స్టార్ హోటళ్ళ మీటింగులు, అజ్ఙాతంలో ఉండి మీడియా ద్వారా చంద్రబాబు వదిలే ఫీలర్ల మార్గం అయితే అసలే కరెక్ట్ కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కంటే జగన్ ఎంచుకున్న పోరాట మార్గమే గొప్పది అని తలకాయ ఉన్న ఎవడైనా చెప్తాడు. కొందరు నాయకులు అధికారంలో ఉండడం కోసం, కులం కోసం రాష్ట్రం నాశనం అయిపోయినా ఫరవాలేదు అనుకునే జనాలకు తప్ప ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -