Friday, May 17, 2024
- Advertisement -

సెల్ ఫోన్ మాట్లాడుతూంటే రైలు గుద్దేసింది

- Advertisement -

చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని దాని లోకం లో పడి అసలు బయట ఉన్న నిజమైన ప్రపంచాన్ని మరచిపోతున్న వారిని మనం రోజూ చూస్తూ ఉంటాం , అంతెందుకు అలా దాంట్లో పడిన వారిలో మనం కూడా అప్పుడప్పుడూ ఒకళ్ళం.

రోడ్డు దాటుతున్నప్పుడు సెల్ ఫోన్ లో చూస్తూ ప్రమాదాలకి గురి అవ్వడం సర్వ సాధారణం అయిపొయింది. ప్రకాశం జిల్లా లో ఒక పాలిటెక్నిక్ విద్యార్ధిని రైలు గుద్దుకుని మరణించింది. రైల్వే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆమె సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పక్కన నడుస్తోంది అని రైలు రాకని ఫోన్ లో పడి ఆమె గమనించలేదు అని అంటున్నారు. అపర్ణ(19) బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సు చివరి సంవత్సరం చదువుతోంది. 

కళాశాల నుంచి ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం స్నేహితులతో కలిసి ఉప్పరపాలెం గేటు సమీపంలోని పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పని పూర్తి అయ్యాక ఇంటికి వెళ్ళడం కోసం ఉప్పర పాలెం గేటు మీదగా రైల్వే స్టేషన్ కి బయలుదేరింది ఆమె. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ట్రాక్ పక్కన వెళుతూ ఉండగా ఆ సమయం లో అక్కడికి వచ్చిన నిజాముద్దీ నుంచి చెన్నై వెళ్ళే కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆమెని వెనక నుంచి డీ కొట్టింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -