Friday, April 19, 2024
- Advertisement -

సినిమాటిక్ గా త్రివిక్రమ్ ప్రేమ పెళ్లి..!

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్‍కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల గురించే కాదు.. ఆయన సినిమాల్లో ఉండే పంచ్ డైలాగ్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. త్రివిక్రమ్ స్పీచ్ లకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ మాటల్ని బట్టి ఆతని లైఫ్ స్టైల్ ఇంకెంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.

ప్రధానంగా అతని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కుమార్తె. త్రివిక్రమ్ పెళ్లి సినిమాటిక్ గా జరిగిపోయింది. త్రివిక్రమ్ మొదట.. తన భార్య సౌజన్య ను కాకుండా.. ఆమె అక్కని చూడటానికి వెళ్లారట. కానీ త్రివిక్రమ్ కు వాళ్ల అక్క కన్నా సౌజన్య నే బాగా నచ్చిందట. ఆ టైంలో తన మనసులో మాటను ఏమాత్రం భయపడకుండా చెప్పేశాడట.

అక్క కాదు చెల్లే నచ్చిందని. సీతారామశాస్త్రికి త్రివిక్రమ్ బాగా తెలిసిన కుర్రాడు కావడం, అందులోనూ అతనిది మంచి కుటుంబం.. అని అలోచించి వెంటనే ఒప్పేసుకున్నారట. అయితే ఓ షరతు పెట్టారట. ముందు పెద్ద అమ్మాయి పెళ్ళి జరిగాకే… మీ పెళ్లి అని ఇరు కుటుంబలు ఓ మాట అనేసుకున్నారట. అలా ఓ సంవత్సరం తర్వాత సౌజన్యతో త్రివిక్రమ్ పెళ్లి జరిగిందట. ఇప్పుడు ఈరికి ఇద్దరు పిల్లలు. సో గురూజీ పెళ్లి ఊడా ‘రోజా’ ‘పెళ్ళి సందడి’ వంటి సినిమా టైపులో జరిగింది.

Also Read

నాగ్ మన్మథుడు హీరోయిన్ ఇప్పుడు ఎలాఉందో తెలుసా..?

బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి ఆ రెండు సినిమాలే అడ్డు..!

రాధే శ్యామ్ లవ్ స్టోరీ కానే కాదట.. నిజమెంతా ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -