రాధే శ్యామ్ లవ్ స్టోరీ కానే కాదట.. నిజమెంతా ..?

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. సాహోతో పాటు సమాంతరంగా ప్రారంభించిన రాధే శ్యామ్ మూవీ షూటింగ్ పలు కారణాల వల్ల విపరీతమైన జాప్యం ఏర్పడింది. ఇక కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో కూడా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు ఆగిపోయింది.

మొత్తానికి ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముగియనుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ అని, యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రాధే శ్యామ్ లవ్ స్టోరీ కాదని, మిస్టరీ స్టోరీ అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ పుకారు షికారు చేస్తోంది.

- Advertisement -

కొన్నేళ్ల కిందట యూరప్ లో ఓ రైలు మిస్ అయి కొన్నేళ్ళ తర్వాత మళ్లీ మెక్సికోలో ప్రత్యక్షమైంది. అసలు ఆ రైలు యూరప్ లో అదృశ్యమై మెక్సికోకు ఎలా చేరుకుంది.. అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని రాధాకృష్ణ రాధే శ్యామ్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రైలు గుహ లోకి వెళ్ళిన తర్వాత మాయమైన ఘటన నేపథ్యంలోనే రాధే శ్యామ్ మూవీ ఉండనుందట. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

Also Read

చరణ్​- శంకర్​ సినిమాలో హీరోయిన్​గా లక్కీబ్యూటీ..!

థియేటర్లపై ఎందుకీ ఆంక్షలు.. నానీ సంచలన వ్యాఖ్యలు

నేను సుమతో విడిపోలేదు.. కొంతకాలం విడిగా ఉన్నా.. కారణం ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -