Saturday, April 27, 2024
- Advertisement -

‘మా’ ఎన్నికలు జరపండి .. కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ..!

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. వెంటనే మా కు ఎన్నికలు జరపాలంటూ మెగాస్టార్ చిరంజీవి మా క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు ఓ లేఖ రాశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మా ఎన్నికల నిర్వహణలో ఆలస్యం చోటు చేసుకోవడంతో సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచి పోతున్నాయని, అందువల్ల వెంటనే ఎన్నికలు వెంటనే జరపాలని ఆయన కోరారు. ‘ప్రస్తుత కమిటీ పదవీకాలం ఈ ఏడాది మార్చి తో ముగిసింది. కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవడంతో పలు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయి. కరోనా నేపథ్యంలో షూటింగ్ లు ఆగిపోయి మా సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఆదుకోవాలంటే కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది.

మా ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి పోటీలో ఉన్న అనేక మంది నటులు ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీనివల్ల మా ప్రతిష్ట మసకబారుతోంది. ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమైతే ఈ వివాదాలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని త్వరగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. సంస్థ ప్రతిష్ట మసకబారుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.’ అని చిరంజీవి కృష్ణంరాజు కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

మా ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన తర్వాత అధ్యక్ష పోటీలో ఉన్న పలువురు నటులు ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. నటి హేమ మా నిర్వహణలో లోపాలు ఉన్నాయని వివాదాస్పద ప్రకటన చేసింది. ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చి ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మా ఎన్నికలు తెర పైకి వచ్చిన తర్వాత నటుల మధ్య జరుగుతున్న వివాదాలపై ఒక అగ్ర హీరో స్పందించడం ఇదే తొలిసారి. కరోనా నేపథ్యంలో మా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి లేఖతో అయినా ఎన్నికలు త్వరగా నిర్వహిస్తారేమో వేచి చూడాలి.

Also Read

మరో విలక్షణ పాత్రలో సత్యదేవ్..!

పాన్ ఇండియా మూవీలో మరో మెగా హీరో.. ఎవరంటే..!

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -