Saturday, April 27, 2024
- Advertisement -

వైజాగ్ కి మహర్దశ మొదలైందా..

- Advertisement -

మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైంది. ముఖ్యంగా కార్య నిర్వాహక రాజధాని గా విశాఖ పట్టణాన్ని ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన యా ప్రాంత వాసులకు ఓ రకమైన భరోసా కలుగుతోంది. తమ పరిస్థితి ఎలాగున్నా భవిష్యత్ తరాలు ఊహించని అభివృద్ధిని చూస్తారన్న నమ్మకం ప్రస్తుత పరిణామాలతో వారితో పెరుగుతోంది. యా ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వాణిజ్య పరమైన అంశాల్లో కూడా విశాఖ వేగం పుంజుకుంది..

ఒకప్పుడు వలసలు అంటే అందరు హైదరాబాద్ వైపు చూసేవారు. రాష్ట్ర విభజన అనంతరం అమరావతి ని ఏపీ రాజధాని గా ప్రకటించినప్పటికీ హైదరాబాద్ స్థాయిలో యా ప్రాంతం పై ప్రజలు ఆసక్తి చూపలేదు. ఐదేళ్ళ కాలంలో తాత్కాలిక నిర్మాణాలు తప్పా.. రాజధాని అన్నంతగా ప్రాచుర్యం పొందలేదు. అందుకే అక్కడకు ప్రజలు వలస వెళ్ళడం పెద్దగ కనిపించలేదు. కనీ ఇప్పుడు విశాఖ కు మాత్రం ఊహించని ఆదరణ లభిస్తోంది. విద్య వైద్య తదితర రంగాల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం కావడం. దేశంలోనే మెట్రో పాలిటన్ సిటీ గా గుర్తింపు పొందడంతో ప్రముఖ కంపెనీలన్నీ విశాఖ లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తటించే పనిలో ఉన్నాయి. ఎ ప్రాంతం అనువ్గా ఉంటుంది. .? భూములు , నీరు, ఇతర వనరులు ఎక్కడ అధికంగా లభ్యమవుతున్నాయి.. తదితర అంశాలను పరిశీలించే పనిలోపడ్డారు..

వాణిజ్య పరంగా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్ కు ఎక్కువగా వలసలు పోయేవారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖ కూడా ప్రాచుర్యం పొందుతుండడంతో ఇక్కడే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఇప్పుడు ఇతర ప్రాంతాల వారు విశాఖ ఉ వలస వస్తుండడం పెరుగుతోంది. రాబోయే అతి కొద్ది కాలంలోనే విశాఖ జనాభా 30 శాతం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది అందుకనుగుణంగా అన్ని శాఖలను విస్తరించే యోచనలో ఉంది. ఇప్పటికే దసరా నాటికి అక్కడకు వెళ్లేందుకు చాలా మంది ప్రణాళికలు రచించుకుంటున్నారు.. 

విశాఖ లో అమాంతం పెరిగిన భూముల ధరలు..?

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ…

మన స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్ ఇలా ఉన్నాయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -