Wednesday, May 22, 2024
- Advertisement -

వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్!

- Advertisement -

ఫేస్‍బుక్ స్థానాన్ని క్రమంగా ఆక్రమించేసిన ఇన్ స్టెంట్ మెసెంజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను యాడ్ చేసుకుంది. ఇక మీదట వాట్సప్‍లో జిఫ్ ఫార్మాట్ లో ఉన్న ఫోటోలను కూడా అప్‍లోడ్ చేయొచ్చు. ఈ విషయాన్ని ద నెక్స్త్ వెబ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ టెక్నాలజీలో వస్తున్న సరికొత్త మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలీస్తుంటుంది.

ఈ సారి కొత్తగా వాట్సప్ ను అప్ డేట్ చేసుకున్న తర్వాత అందులో జిఫ్ ఫోటోలు ఆటోప్లే అవుతాయి. యూజర్లు కూడా నేరుగా జిఫ్ ఫోటోలను తమ చాట్‍లో ఎంబెడ్ చేసుకోవచ్చు.

వాట్సప్ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఇప్పటికే యాపిల్ ఐఫోన్లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ మొబైల్స్ కు కూడా వస్తుందని అంటున్నారు. ఇది పూర్తియిన తర్వాత.. స్కైప్‍కి పోటీగా వెళ్లేందుకు త్వరలో వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించేందుకు వాట్సప్ ప్రయాత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫేస్‍బుక్ మెసెంజర్, వైబర్లలో జిఫ్ సపోర్ట్ వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -