Sunday, May 4, 2025
- Advertisement -

తెలుగు తెరపై సీతమ్మలు

- Advertisement -

తెలుగు వారికి రామాయణం మీద చెప్పలేనంత ప్రేమ. ఎన్నిసార్లు తీసినా మరో మారు తీసి తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. అందులోనూ సీతమ్మ పాత్ర అంటే భక్తితో చేతులు జోడిస్తారు. తెలుగింటి సీతమ్మ అంటే అంజలీదేవి గారు గుర్తొస్తారు. ఆవిడతో పాటు సీతమ్మ పాత్రను అద్భుతంగా పోషించిన ఐదుగురు నటీమణుల గురించి ఇక్కడ..

అంజలీదేవి – లవకుశ(1963)
తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసిన చిత్రం. తెలుగులో తొలి పూర్తి స్థాయి కలర్ చిత్రం. రాముడంటే ఎన్టీఆర్ అని ఎంతగా పేరు పొందిందో. సీత అంటే అంజలీదేవి అనేంత పేరు తెచ్చుకున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆమెను​ చూస్తే సీత అచ్చంగా ఇలాగే ఉంటుందని అనిపిస్తుంది.

గీతాంజలి – సీతారామకల్యాణం(1961)
హాస్య, సహాయక పాత్రల్లో పేరు పొందిన నటి గీతాంజలికి సీతగా గుర్తింపు తెచ్చిన చిత్రం. ఈ చిత్రాన్ని నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మించగా, ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. రాముడిగా హరనాథ్ నటించారు. సీత పాత్రలో గీతాంజలి చక్కగా ఒదిగిపోయారు.

చంద్రకళ – సంపూర్ణ రామాయణం (1971)
అనేక తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన చంద్రకళ ఈ చిత్రంలో సీత పాత్ర పోషించారు. శోభన్‌బాబు రాముడిగా నటించి మెప్పించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రామకథకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సీత పాత్రలో నటించిన చంద్రకళ మళ్లీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడం విచిత్రం.

జయప్రద – సీతాకల్యాణం(1976)
బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమాల్లో ఒక ఆణిముత్యం. రామకథని అద్భుతమైన దృశ్యరూపంగా మలిచి తెలుగు వారికి అందించారు. రాముడిగా మలయాళ నటుడు రవి నటించగా, సీతగా జయప్రద నటించారు. ఆమె అభినయం చూసి ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే లాంటివారే ముచ్చట పడి, ప్రత్యేకంగా ప్రశంసించారు.

నయనతార – శ్రీరామరాజ్యం (2011)
బాపు దర్శకత్వంలోనే మరో మారు రామకథ తెరకెక్కింది. బాలకృష్ణ రాముడిగా నటించగా, సీత పాత్రలో నయనతార ఒదిగిపోయారు. ఆధునిక కాలంలో సీత పాత్ర పోషించి మెప్పించిన ఘనత సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటిగా నందితో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు.

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

విక్టరీ వాకిట్లో నందుల పంట

లేడీ గెటప్ లో మన హీరోలు..

పురాణ పాత్రలకు ప్రాణం పోసిన ఐదుగురు నటీమణులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -