విక్టరీ వాకిట్లో నందుల పంట

- Advertisement -

పురస్కారం అందుకోవడం ఓ ఆనందం. అంతకుమించి ఓ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం అందుకోవడం ఓ ఘనత. ప్రధాన పాత్రలో నటించి, ఉత్తమ నటుడిగా పురస్కారం కైవసం చేసుకోవడం హీరోలకు ఆనందాన్నీ, బాధ్యతనూ ఏకకాలంలో అందిస్తాయి. అందులో విక్టరీ వెంకటేష్‌ది ప్రత్యేక శైలి. అత్యధిక సార్లు నంది​ పురస్కారం అందుకున్న నటుడు ఆయనే. ఆ చిత్రాల గురించి..

ప్రేమ (1989)
సురేష్ కృష్ణ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం వెంకటేష్‌కు ఉత్తమ నటుడిగా తొలి నంది అందించింది. గాయకుడు కావాలని తపించే పృథ్వి పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను అలరించింది. తన ప్రియురాలిని కాపాడుకునే ప్రయత్నంలో​ ఆయన నటన నేటికీ నిత్యనూతనంగా ఉంటుంది.

- Advertisement -

ధర్మచక్రం (1996)
లాయర్ రాకేష్ పాత్రలో సమాజంలోని అన్యాయాన్ని, తండ్రి లోని క్రూరత్వాన్ని ఎదిరించే పాత్రలో వెంకటేష్ నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇదే చిత్రానికి గానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగానూ వెంకటేష్ పురస్కారం అందుకున్నారు.

గణేష్ (1998)
దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి స్వామి దర్శకుడు. వైద్య వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి కారణంగా తండ్రి, చెల్లెల్ని పోగొట్టుకున్న విలేకరి గణేష్ పాత్ర ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. నందిని ఆయన వశం చేసింది.

కలిసుందాం రా (1999)
ఉమ్మడి కుటుంబం విలువల గురించి చెప్పే ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. ఇందులో ఆయన పోషించిన రఘు పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందించింది.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
ప్రేమించిన యువతి, స్నేహితుడి కుటుంబం.. ఈ రెండు దారుల మధ్య నలిగిపోయే గణేష్ పాత్ర వెంకటేష్‌కు నంది పురస్కారం వచ్చేలా చేసింది. తండ్రి (కోట శ్రీనివాసరావు) మరణించిన సమయంలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.

రాజన్నలో మల్లమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

వేశ్య పాత్రల్లో అద్భుత నటన..!

తెలుగు లో ఉత్తమ నటీమణులు ఆనలుగురు…

నవ్వంచారు.. నందులు అందుకున్నారు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...