Saturday, March 30, 2024
- Advertisement -

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

- Advertisement -

భార్యాభర్తలు చూడముచ్చటగా ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. సినిమాలో హీరో, హీరోయిన్ల జంట చూడచక్కగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కొందరిది హిట్​ కాంబినేషన్. ఈ హీరో పక్కన ఈ హీరోయిన్ ఉంటే నిర్మాతకు కనకవర్షమే అనిపించే ఐదు కాంబినేషన్ల గురించి ఇక్కడ..

ఎన్టీఆర్ – సావిత్రి
తెలుగులో తొలి హిట్ పెయిర్‌గా చెప్పుకోదగ్గ కాంబినేషన్ వీళ్లది. ‘పెళ్లి చేసి చూడు (1952), మిస్సమ్మ (1955), అప్పు చేసి పప్పు కూడు (1959), గుండమ్మ కథ (1962).. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం (1967), కోడలు దిద్దిన కాపురం(1970) లాంటి సినిమాల్లో వీరే వదిన మరుదులుగా నటించి మెప్పించడం విశేషం.

అక్కినేని నాగేశ్వరరావు – జమున
వీరిద్దరి కాంబినేషన్ అంటే తెరపై వెన్నెల కురిసినట్టే! అనేక చిత్రాల్లో వీరు జోడీగా నటించారు. మిస్సమ్మ (1955), పెళ్లినాటి ప్రమాణాలు (1958), ఇల్లరికం (1959), గుండమ్మ కథ(1962), మూగమనసులు (1964), మూగనోము (1969).. ఇలా అనేక సినిమాల్లో వీరి జంట ప్రేక్షకులను​కనువిందు చేసింది.

శోభన్ బాబు – వాణిశ్రీ
సోగ్గాడు శోభన్ బాబు, అందగత్తె వాణిశ్రీ.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే జనం వెర్రెక్కిపోయేవారు. అనేక చిత్రాల్లో జోడీగా నటించి మెప్పించారు. బంగారు పంజరం (1965), చెల్లెలి కాపురం (1971), గంగ మంగ (1973), జీవన తరంగాలు(1973), జీవన జ్యోతి (1975) లాంటి సినిమాల్లో వీరి జంట.. కన్నులపంట.

చిరంజీవి – రాధ
‘నాతో పోటీగా స్టెప్పులు వేయగలిగిన నటి రాధ’ అని చిరంజీవి ఇచ్చిన కితాబు చాలు వీరి కాంబినేషన్ ఎంత క్రేజీయో చెప్పేందుకు! దాదాపు 25కు పైగా సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. దొంగ(1985), అడవిదొంగ(1986), కొండవీటి రాజా (1986), రాక్షసుడు (1986), యముడికి మొగుడు (1988), కొండవీటి దొంగ(1990).. చెప్తూ పోతే జాబితా చాలా పెద్దదే!

బాలకృష్ణ – విజయశాంతి
1980 దశకంలో కుర్రకారును ఆకట్టుకున్న జంట వీరిది. దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించిన విజయశాంతి కెరీర్లో బాలయ్యతో మరపురాని చిత్రాలు చేశారు. కథానాయకుడు (1984), పట్టాభిషేకం (1985), ముద్దుల కృష్ణయ్య (1986), దేశోద్ధారకుడు(1986)
సాహస సామ్రాట్ (1987), భార్గవ రాముడు (1987), భానుమతి గారి మొగుడు (1989), లారీ డ్రైవర్ (1990).. ఇలాంటి​ అనేక చిత్రాల్లో వీరి కాంబినేషన్ చూడముచ్చటగా నిలిచింది.

గుప్పెడన్ని సీన్లు.. చిరకాలం గురుతులు.

నచ్చిన పాత్రలను మిస్ చేసుకున్న నటీనటులు..!

మాయాబజార్ సినిమాలో​.. భలే భలే టైటిల్స్!

ఎన్టీఆర్ భిన్నమైన వేషాలు.. హిట్ అయిన ఐదు సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -