Thursday, April 25, 2024
- Advertisement -

పురాణ పాత్రలకు ప్రాణం పోసిన ఐదుగురు నటీమణులు

- Advertisement -

తెలుగు వారికి పురాణాలంటే చాలా ఇష్టం. వాటి ఆధారంగా వచ్చిన సినిమాలంటే మరీ ఇష్టం. 1931లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ పురాణాల ఆధారంగా తీసిందే! పురాణ పాత్రలు పోషించి మెప్పించడం అంత సులభమైన విషయం​ కాదు. ఆహార్యం, వాచకం, నటన.. అన్నీ కుదిరితేనే ప్రేక్షకులను మెప్పించగలరు. తెలుగులో​ అలా పురాణ పాత్రలకు ప్రాణం పోసిన ఐదుగురు నటీమణుల గురించి..

నందమూరి తారక రామారావు – కృష్ణుడు
కృష్ణుడంటే ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు. తెలుగు వారికి అంతగా దగ్గరైన పాత్ర ఇది. అంతకు ముందు నాటకాల్లో ఈలపాట రఘురామయ్య గారు కృష్ణుడిగా ఒక వెలుగు వెలిగినా ‘మాయాబజార్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రకు బ్రాండ్‌గా మారిపోయారు. ఆ గెటప్‌తో ఉన్న ఫొటోలను అభిమానులు వాళ్ల ఇళ్లల్లో పెట్టుకుని పూజలు చేయడం మరెవరికీ దొరకని స్టార్‌డమ్.

అంజలీదేవి – సీత
తెలుగింటి సీతమ్మ అంటే అంజలీదేవి. ‘లవకుశ’ సినిమాతో ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆమె, ఆ ఒక్క సినిమాతోనే సీత పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఆ తరువాత ఎంత మంది ఆ పాత్ర వేసినా తప్పకుండా ఆమె ప్రభావం పడిందనేది వాస్తవం.

జమున – సత్యభామ
‘మీరజాలగలడా’ అంటూ కృష్ణుడ్ని కొంగున ముడేసుకున్న గడుసు ఇల్లాలు సత్యభామ అంటే తెలుగు వారికి జమున గారే గుర్తొస్తారు. ‘దీపావళి’, ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాల్లో ఆమె సత్యభామగా నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఆ పాత్రను నిలిపారు.

కాంతారావు – నారదుడు
కలహ భోజనుడైన నారదుడి పాత్రలో చాలా మంది నటించినా, మనకు బాగా గుర్తొచ్చేది కాంతారావు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఆయన నటన అనితరసాధ్యం అనిపిస్తుంది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లోనూ నారదుడి పాత్ర పోషించి మెప్పించారు.

ధూళిపాళ సీతారామశాస్త్రి – శకుని
‘అని గట్టిగా అనరాదు. వేరొకరు వినరాదు’ అంటూ అద్భుతమైన వాచకంతో, అజరామరమైన నటనతో శకుని పాత్రకు ప్రాణం పోశారు ధూళిపాళ. ఆయన పేరు చెప్పగానే శకుని పాత్ర గుర్తొస్తుంది. ‘దానవీర శూరకర్ణ’, ‘బాలభారతం’ లాంటి అనేక చిత్రాల్లో ఆయన శకుని పాత్ర పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -