తాలిబన్ల అరాచకానికి ఏడాది.. ఆఫ్ఘాన్ లో దారుణ పరిస్థితి?

గత ఏడాది ఇదే ఆగష్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ చేసిన అరాచకం ఏస్థాయిలో సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఆగష్టు 15 న అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి నిష్క్రమించడంతో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. వారి హింస పరిపాలనను తాళలేక వేలాది మంది ప్రజలు ఆ దేశం విడిచి వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాలు, ఆర్తనాదలు ఇప్పటికీ కూడా మన కళ్ల ముందు అలా మెదులుతూనే ఉన్నాయి.

మరి ఆఫ్ఘాన్ లో తాలిబన్ల పరిపాలన మొదలై ఏడాది గడిచింది.. మరి ఈ ఏడాది లో అక్కడ ఏమైనా మార్పులు కనిపించాయా ? అంటే తాలిబన్ల పాలనతో ప్రపంచ దేశాలలో ఒంటరిగా మిగిలిపోయిన ఆఫ్ఘాన్ ఆకలి కేకలతో మరింతగా అలమటిస్తోంది. ప్రపంచ దేశాలు తాలిబన్ల కారణంగా అఫ్గాన్ తో చేతులు కలిపేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ఆ దేశం ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

దేశంలో సగటు ప్రజల తలసరి ఆదాయం భారీగా తగ్గిపోవడంతో వేల మంది ప్రజలు ఇతర దేశాలకు వలసల బాటా పట్టారు. ఇక పాలన మొదట్లో ఆఫ్ఘాన్ లో మెరుగైన పాలన అందిస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన తాలిబన్లు వాటిని తుంగలో తొక్కారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటో దయనీయంగా ఉంది. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో తాలిబన్ల ప్రపంచ దేశాలతో సంభందాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఏ దేశం కూడా ఆఫ్ఘాన్ తో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు సిద్దంగా లేవు. మరి ముందు రోజుల్లో ఆఫ్ఘాన్ అభివృద్ది కోసం తాలిబన్ల కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read

మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?

ఆన్లైన్ లోన్ యాప్స్ విషయంలో.. జాగ్రత్త !

మోడీజీ.. విజన్ 2047 నెరవేరేనా ?

Related Articles

Most Populer

Recent Posts