Saturday, April 27, 2024
- Advertisement -

ఆసీస్‌తో సిరీస్‌..భారత్‌కు విషమపరీక్షే?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌కి ముందు భారత్‌ విషమపరీక్షను ఎదర్కొనుందా…?వరల్డ్ కప్‌కి మందు టీమిండియా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తాయా…?అసలు టీం మేనేజ్ మెంట్ ఏం ఆలోచిస్తుంది…?ఇప్పుడు సగటు క్రికెట్‌ ఫ్యాన్‌ మదిలో మెదుగుతున్న ప్రశ్న ఇదే. ఆసియా కప్‌ గెలిచిన జోష్ మీదున్న టీమిండియాకు ప్రపంచకప్‌కి ముందు ఆసీస్‌తో సిరీస్‌ సవాల్‌తో కూడుకుందనే చెప్పాలి. ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే ప్రపంచకప్‌కి ముందు వన్డే సిరీస్ గెలవడం ద్వారా జోష్‌తో బరిలోకి దిగవచ్చు.

ఇక ప్రధానంగా ఈ సిరీస్‌లో గెలవడం ద్వారా ఆసీస్ – భారత్ రెండు జట్లకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలచే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అయితే భారత జట్టు చేస్తున్న ప్రయోగాలకు తోడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మూల్యం చెల్లించుకోక తప్పనిసరి పరిస్థితి.

ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో భారత్ 146 మ్యాచ్ లు అడగా టీమిండియా మాత్రం 67 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ఏ రకంగా చూసిన టీమిండియాపై ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. దానికి తోడు ఆసీస్ జట్టులో చివరి ప్లేయర్ వరకు అటు బౌలింగ్‌లోనైనా ఇటు బ్యాటింగ్‌లోనైనా సత్తాచాటుతారు. ముఖ్యంగా ఒత్తిడిని జయించడం ఆసీస్ ప్లేయర్ల ప్రత్యేకత. ఈ విషయంలో భారత్‌ మాత్రం ఖచ్చితంగా వెనుకబడే ఉంది. ఏ మాత్రం ఒత్తడికి లోనైనా అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఖచ్చితంగా విఫలమవుతారు.

ఒకవేళ ఈ సిరీస్ ఓటమి పాలు అయితే టీమిండియా ప్లేయర్స్ లో కాన్ఫిడెంట్ సన్నగిల్లే అవకాశం ఉండి అది ప్రపంచ కప్ లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -