Wednesday, May 22, 2024
- Advertisement -

300 వికెట్ల క్ల‌బ్‌లో అశ్విన్‌…

- Advertisement -

భారత ప్రధాన స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో మూడొందల వికెట్లను వేగవంతంగా సాధించిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో​ లహిరు గామేగ్‌ అవుట్‌ చేసిన అశ్విన్‌ మూడొందల వికెట్ల క్లబ్‌లో చేరాడు.

నిన్న‌టి వ‌ర‌కు ఈ ఘ‌న‌త ఆస్ట్రేలియా బౌల‌ర్‌ డెన్నిస్ లిల్లీ ఖాతాలో ఉండేది. నాగ్‌పూర్ టెస్టు మొద‌టి ఇన్నింగ్స్ లో అశ్విన్ 67 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీసి 63 ప‌రుగులు ఇచ్చాడు.

ఆస్ట్రేలియా బౌల‌ర్‌ డెన్నిస్ లిల్లీ మొత్తం 56 మ్యాచుల్లో 300 వికెట్లు తీయ‌గా, అశ్విన్‌ 54 టెస్టు మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. అంతేకాదు, టెస్టుల్లో 300 వికెట్లు తీసిన భార‌త‌ ఆరో స్పిన్న‌ర్ అశ్విన్ నిలిచాడు. 300 టెస్ట్ వికెట్లు తీసిన ప్ర‌పంచ‌ 31వ బౌల‌ర్‌గా అశ్విన్ రికార్డులోకి ఎక్కాడు. అలాగే, ఈ ఏడాది 50వ టెస్టు వికెట్‌ను కూడా అశ్విన్ త‌న‌ ఖాతాలో వేసుకుని మరో మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -