Saturday, April 27, 2024
- Advertisement -

ఇంగ్లీష్ గడ్డపై ఒకే ఒక్కడు..అశ్విన్!

- Advertisement -

రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి 112 పరుగులకే 5 వికెట్లు కొల్పోయింది ఇంగ్లాండ్. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా పేస్ బౌలర్ ఆకాష్ దీప్ ఆరంగేట్రం చేయగా తొలి స్పెల్‌లోనూ అదరగొట్టి మూడు వికెట్లు తీశాడు ఆకాష్‌.

ఇక స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఫీట్ సాధించి ఇంగ్లీష్ గడ్డపై రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్..బెయిర్ స్టోని ఔట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్‌పై 100 వికెట్లు తీశాడు. ఇలా ఓ భారత బౌలర్ ఇంగ్లండ్‌పై 100 వికెట్లు,1000 పరుగులు చేసిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.

అశ్విన్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు. వెస్టిండీస్ క్రికెట‌ర్ గ్యారీ సోబ‌ర్స్ 3,214 ప‌రుగులు చేసి 102 వికెట్లు ప‌డ‌గొట్టగా ఆస్ట్రేలియాకు చెందిన మోంటీ నొబ్లే 1,905 ప‌రుగులు చేసి 115 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాకే చెందిన‌ గిఫ్ఫెన్ ఇంగ్లండ్‌పై 1,085 ప‌రుగులు కొట్టి, 100 వికెట్లు నేల కూల్చాడు. ఇప్పుడు అశ్విన్ భారత్ తరపున ఈ రికార్డు నెలకొల్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -