Friday, April 19, 2024
- Advertisement -

వ‌హ్వా అశ్విన్‌.. 114 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు

- Advertisement -

ఇంగ్లండ్‌తో చెన్నైలో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌల‌ర్ రవిచంద్ర‌న్ అశ్విన్ చెల‌రేగిపోయాడు. ఆదిలోనే ఓపెన‌ర్లు రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ వికెట్లు కూల్చిన అశ్విన్‌.. ఆ త‌ర్వాత బెన్‌స్టోక్్స‌, డామ్ బెస్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌, జేమ్్స అండ‌ర్‌స‌న్‌ల‌ను అవుట్ చేసి ఆరు వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇక్క‌డే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్్స‌లో భాగంగా ఈ స్పిన్న‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

తొలి బంతికే తొలి వికెట్(రోరీ బ‌ర్్న్స) తీసిన స్పిన్న‌ర్‌గా 114 ఏళ్ల నాటి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 1907లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ బెర్ట్‌ వాల్గర్ పేరిటే ఈ రికార్డు ఉంది. అంత‌కు 17 ఏళ్ల ముందు ఇంగ్లండ్ బౌల‌ర్ బాబీ పీల్ మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించాడు. ఇక ఇప్పుడు అశ్విన్ కూడా ఈ రికార్డులో త‌న పేరు లిఖించుకున్నాడు. అది కూడా త‌న సొంత రాష్ట్రంలో ఈ అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుని చ‌రిత్ర‌కెక్కాడు.

అందునా ఓ ఇంగ్లండ్ బౌల‌ర్ పేరిట ఉన్న రికార్డులో, ఇంగ్లండ్ ఓపెన‌ర్‌ను అవుట్ చేసి వ‌హ్వా అనిపించాడు ఈ త‌మిళ‌నాడు స్పిన్న‌ర్‌. ఇక నాలుగో రోజు ఆట‌లో భాగంగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇక‌ ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 178 పరుగులకు ముగించి, భార‌త్‌కు 420 పరుగుల ల‌క్ష్యం విధించింది. ఆట ముగిసే స‌రికి టీమిండియా రెండో ఇన్నింగ్్స‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(12) అవుట్ అయ్యాడు.

భ‌ళా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. న‌మ్మ‌కం నిల‌బెట్టుకున్నావు!

కరోన టీకాతో మరో ఫ్రంట్ లైన్ వారియర్ మృతి!

నెటిజన్‌ కామెంట్‌‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -