Saturday, April 27, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : క్రెడిట్ అశ్విన్ కు కూడా దక్కాల్సిందే !

- Advertisement -

టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 లో ఈ నెల 23న ఇండియా పాకిస్తాన్ మద్య జరిగిన మ్యాచ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి. ఇరు జట్ల మద్య జరిగిన హోరాహోరీ పోరు.. ఓ యుద్దని తలపించేలా ఉండడంతో.. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగింది. అసలే ఈ రెండు జట్ల మద్య మ్యాచ్ అంటే రణరంగాన్ని తలపిస్తుంది.. అలాంటిది విజయం ఇరుజట్లను దొబుచులాడుతుంటే.. ఆటగాళ్లలో ప్రతి బాల్ కు పెరుగుతున్న ఒత్తిడి.. అభిమానుల్లో ప్రతి క్షణం ఊపిరిబిగబట్టుకునేంత ఉత్కంఠ.. ఇలా నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది..

ఇక గత మూడేళ్ళ కాలంగా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నప్పటికి.. ఏమాత్రం జడియక విరాట్ అంటే ఎప్పటికీ కింగ్ కోహ్లీనే అని మరొకసారి ప్రపంచానికి చాటిచెప్పాడు మన రన్ మిషన్. విజయం చేజారిపోతున్న క్రమంలో తన ఆత్మవిశ్వాసం ఏమాత్రం కోల్పోకుండా సంకల్ప బలంతో పాకిస్తాన్ పై 53 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించి.. ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని భారత్ కు అందించాడు విరాట్ కోహ్లీ. ఇక మ్యాచ్ అనంతరం తన కెరియర్ లో ఇదే అత్యుత్తమ మ్యాచ్ అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా గెలుపులో విరాట్ పాత్రతో పాటు.. హర్ధిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్ పాత్ర కీలకమైనదనే చెప్పాలి. జట్టుకు క్లిష్ట పరిస్థితుల్లో విరాట్ కు చక్కటి సహకారం అందిస్తూ.. 37 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు అత్యవసర స్కోర్ అందించాడు.

ఇక మ్యాచ్ అంతా ఒకెత్తు అయితే చివరి రెండు బంతులు మరో ఎత్తు.. విజయనికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా అందరిలోనూ ఉత్కంఠ..క్రీజ్ లో కోహ్లీ లేడు.. అశ్విన్ ఉన్నాడు. దాంతో మ్యాచ్ గెలుపుపై అందరిలోనూ అనుమానమే. ఓ వైపు తీవ్రమైన ఒత్తిడి.. అలాంటి కృష్ట పరిస్థితుల్లో అశ్విన్ చూపిన సమయస్పూరి మ్యాచ్ ఫలితన్నే మార్చేసింది. వైడ్ బాల్ ను ఎంతో కూల్ గా వదిలేయడం.. జట్టు స్కోర్ సమంగా నిలిచింది. ఇక చివరి బంతికి సింగిల్ తీయడంతో విజయం సొంతమైంది. ఒకవేళ అశ్విన్ వైడ్ బాల్ ను ఏమాత్రం పరుగుగా మరిచే ప్రయత్నం చేసిన మిస్ ఫైర్ అయ్యి.. ఫలితం మరోలా ఉండేది. దాంతో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అశ్విన్ కూల్ గా చూపిన సమయస్పూర్తికి కూడా క్రెడిట్ ఇవ్వాలని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నరాలు తెగే ఉత్కంఠ.. పాక్ పై ఇండియా చిరస్మరణీయ విజయం !

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కివీస్ బోణి !

సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. సచిన్ క్లారిటీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -