ఏపీ టీడీపీ అధ్యక్షుడికి పోలీసుల నోటీసులు

- Advertisement -

సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయ నంది విగ్రహం తరలింపు వివాదంలో టెక్కలి పోలీసులు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి 41ఏ సెక్షన్‌ కింద నోటీసు జారీ చేశారు. కాశిబుగ్గ డీఎస్పీ ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో చెట్టు కింద ఖాళీగా ఉన్న నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బయట ఉన్న ఒక దిమ్మెపై పెట్టారు.

దీనిపై స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా ఆలయ కమీటీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో 16 మందిపై సంతబొమ్మాళి పోలీసులు కేసులు నమోదు చేశారు. విగ్రహం తరలింపు ముందు రోజు కమిటీ సభ్యులంతా అచ్చెన్నాయుడిని కలిసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు తమ ఎదుట హాజరు కావాలని ఆయనకు బుధవారం నోటీసులు పంపించారు.

- Advertisement -

నేడు అచ్చెన్నాయుడు విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బ్యాచ్‌ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పినట్టు వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

నిమ్మ‌గ‌డ్డ‌కు కూడా ఆ విష‌యం తెలుసు: స‌జ్జ‌ల‌

పెళ్లి చేసుకుందాం అంటూ 14 లక్షలకు టోపీ!

హిట్‌మాన్ పాపం.. వారిలో జ‌డేజా ఒక్క‌డే

అందాల రాక్ష‌సి ముద్దు పెడుతోందా?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News