Friday, April 26, 2024
- Advertisement -

పల్లెల్లో చిచ్చు రేపి, పబ్బం గడుపుకుంటారా?

- Advertisement -

పచ్చని పలెల్లో చిచ్చు పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఉబలాటపడుతోంది. ఏకగ్రీవాలను ప్రోత్సహించి పల్లెల అభివృద్ధికి పాటుపడాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగా పచ్చ నేతలు మాత్రం దుష్ట రాజకీయాలే తమ ఎజెండా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఏకగ్రీవ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది. అయితే ప్రోత్సాహకాలొద్దని, ఎన్నికలే కావాలని టీడీపీ నాయకులు రాజకీయాలు చేయడం వారి వైఖరికి అద్దం పడుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2001 నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. 2013 పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాకుళం పరిధిలో 225 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నరసన్నపేట మండలం నడగాం, సత్యవరం రూరల్‌ పంచాయతీలు సైతం ఏకగ్రీవమే అవగా.. వాటికి టీడీపీ నేతలే ప్రాతినిధ్యం వహించారు. నరసన్నపేటలోనే మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు జరుగుతూనే ఉన్నాయి.

ఎందుకు ఈ వైఖరి?
ఈ సారి మాత్రం ఏకగ్రీవాలు వద్దంటూ టీడీపీ వింత వాదన తెరపైకి తెస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కళా వెంకటరావు అదే రీతిలో మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాలకు ప్రోత్సాహకాలు వస్తాయని ప్రజలు భావిస్తుంటే ఎన్నికలు పెట్టి ఘర్షణలు సృష్టించాలని టీడీపీ నాయకులు అడ్డు తగులుతున్నారు. గ్రామాల్లో గొడవలకు ఉసిగొల్పి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.

అచ్చెన్నకు నోటీసులు

ఉద్యోగులు, అధికారుల‌ను కాపాడుకుంటాం‌

ఏక‌గ్రీవాల‌పై ఎస్ఈసీ కుట్ర‌పూరిత వ్య‌వ‌హారం!

అధికార పార్టీ ఎమ్మెల్యేకు భారీ షాక్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -