Wednesday, May 15, 2024
- Advertisement -

క్రికెట్ దేవుడు స‌చిన్ నేడు 43 వ పుట్టిన రోజు…

- Advertisement -

దిగ్గ‌జ క్రికెట‌ర్‌, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు.1973 ఏప్రిల్‌ 24న జన్మించిన సచిన్‌కు బుధవారంతో 46 ఏళ్లు నిండనున్నా .దేశానికి 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఈ మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌… ఆ క్రమంలో టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు గడిచిపోయినా.. సచిన్‌కే సాధ్యమైన క్లాస్ బ్యాటింగ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. సచిన్ అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడగా.. చివరి టోర్నీలో వరల్డ్ కప్ కల నెరవేరింది.నవంబర్ 2013లో సచిన్ తన చివరి మ్యాచ్‌ను వెస్టిండీస్‌పై ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ సచిన్‌ కెరీర్‌లో 200వ టెస్ట్. ఇక ముంబై తరుపున ఐపీఎల్‌లోనూ ఆడిన సచిన్.. 79 మ్యాచ్‌ల్లో 2334 పరుగులు సాధించారు. ఇందులో 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిసారు.

టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యువతకు సచిన్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీతో ఉన్న సచిన్ ఫొటోలను గంటా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -