Friday, May 17, 2024
- Advertisement -

పాక్… కాస్కో… అండ‌ర్ 19 వ‌ర్ల‌డ్ క‌ప్ సెమీఫైన‌ల్‌లో భార‌త్ వ‌ర్సెస్ పాక్‌…

- Advertisement -

క్రికెట్‌లో మ‌రో సారి దాయాదుల మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది. అండర్‌–19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. పృథ్వీ షా నాయకత్వంలోని భారత్‌ జట్టు సెమీస్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 131 పరుగుల తేడాతో చిత్తు చేసి సెమీఫైన‌ల్‌కు దూసుకెల్లింది.

లీగ్ దశలో మూడు మ్యాచ్‌లనూ గెలిచిన భారత్.. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెమీస్‌లో తలపడేందుకు సన్నద్ధమైంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. శుభ్నమ్‌ గిల్‌(86), అభిషేక్‌ శర్మ(50), కెప్టెన్ పృథ్వీ షా(40), హార్విక్ దేశాయ్ (34) రాణించడంతో 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. టాపర్డర్ రాణించినప్పటికీ లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఆఖరి ఐదుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

ఇక.. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి బంగ్లా.. ఇక తేరుకోలేకపోయింది. వరసపెట్టి వికెట్లను కోల్పోయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ టెస్ట్ మ్యాచ్‌ను తలపించారు. 42.1 ఓవర్లు ఆడి కేవలం 134 పరుగులు చేసి బంగ్లా ఆలౌటయ్యింది. భారత్‌ బౌలర్లు నాగర్‌ కోటి(3), శివమ్‌ మావి(2), అభిషేక్‌ వర్మ(2) రాణించారు. దీంతో భారత్‌ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

భారత బౌలర్లలో నాగర్‌కోటి 3 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్‌ శర్మ, శివమ్‌మావి రెండేసి వికెట్లు తీశారు. అనుకుల్‌ రాయ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఈనెల 30న సెమీఫైనల్-2 జరగనుంది. మరోవైపు ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్థాన్‌ మధ్య ఈ నెల 29న సెమీఫైనల్‌-1 జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -