Friday, May 17, 2024
- Advertisement -

కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి గాయం….తొలి టెస్టులో ఆడడంపై అనిశ్చితి

- Advertisement -

విండీస్ టూర్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నారు. మూడు వన్డేల్లో భాగంగా టీమిండియా రెండు వన్డేలు గెలిచి వన్డే సిరీస్ ను కౌవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో కోహ్లీ గాయపడినట్లు సమాచారం.

విండీస్‌ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. అయితే ఫిజియోతో ప్రాథమిక చేయడంతో బ్యాటింగ్‌ను కొనసాగించిన కోహ్లి సెంచరీ సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

కోహ్లీకి గాయం నేపథ్యంలో తొలి టెస్టుకు అందుబాటులో ఉండే విషయంపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కానింగ్ కూడా నిర్వహించినట్టు తెలిసింది. అయితే కోహ్లీ మాట్లాడుతూ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేదని తేలిందని, వేలి ఎముక విరగలేదని పరీక్షలో వెల్లడైందని తెలిపాడు.

ఎముక బ్రేక్ అయ్యింటె బ్యాటింగ్ కొనసాగించేవాడ్ని కాదని స్పష్టం చేశాడు. ఇది చిన్న దెబ్బేనని విండీస్ తో తొలి టెస్టులో తప్పకుండా ఆడతానని కోహ్లీ వివరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -