Thursday, May 16, 2024
- Advertisement -

మైదానంలో కోహ్లీ అత్యుత్సాహం…రిఫ‌రీకి వివ‌ర‌న ఇచ్చిన కోహ్లీ

- Advertisement -

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంటే.. మరోవైపు ‘మైక్‌ డ్రాప్’ వివాదంపై చర్చ కొనసాగుతూనే ఉంది. బుధ‌వారం ప్రారంభ‌మైన తొలి టెస్ట్‌లో కెప్టెన్ జో రూట్‌ని ర‌నౌట్ చేసిన తర్వాత కోహ్లీ మైదానంలో మైక్‌ డ్రాప్’ సంబరాలు చేసుకున్నాడు. సాధారణంగా.. గొప్ప ప్రదర్శన చేసినప్పుడు లేదా అద్భుతమైన స్పీచ్‌ ఇచ్చిన తర్వాత ఈ తరహా సంబరాలు చేసుకుంటారు. దీనిపై వివ‌ర‌న ఇవ్వాల‌ని మ్యాచ్ రిఫరీ సమన్లు జారీ చేశాడు

మైదానంలో కోహ్లి అలా జో రూట్‌ని కవ్విస్తూ సంబరాలు చేసుకోవడంపై మాజీ క్రికెటర్లు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. రూట్ ఔటై పెవిలియన్‌కి వెళ్తున్న బ్యాట్స్‌మెన్‌ను.. జట్టు కెప్టెన్ హోదాలో ఉన్న కోహ్లి అలా కవ్వింపులకి దిగడాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆర్తేర్టన్ తప్పుబట్టాడు.

ఆటలో మూడోరోజైన శుక్రవారం భారత జట్టు మైదానంలోకి వెళ్లే ముందు మ్యాచ్ రిఫరీని స్వయంగా కలిసిన కోహ్లి ‘మైక్ డ్రాప్’ సంబరాలపై వివరణ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రిఫరీ.. కోహ్లి క్రమశిక్షణ తప్పాడని నిర్ధారిస్తే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. శిక్షని ఖరారు చేసే అవకాశం ఉంది. మ్యాచ్ ఫీజులో కోత‌గాని లేక‌పోతే ఒక్కోసారి వార్నింగ్‌తోనూ సరిపెట్టవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -