Friday, May 17, 2024
- Advertisement -

క్రిస్‌లిన్ దూకుడు . పంజాబ్‌కు 192 ప‌రుగుల భారీ ల‌క్ష్యం…

- Advertisement -

సొంతగడ్డపై కింగ్స్‌పంజాబ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ విజృంభించాడు. ఓపెనర్ క్రిస్‌లిన్ (74: 41 బంతుల్లో 6×4, 4×6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (43: 28 బంతుల్లో 6×4), రాబిన్ ఉతప్ప (34: 23 బంతుల్లో 5×4, 1×6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

సంచలన ఓపెనర్ సునీల్ నరైన్(1)ని రెండో ఓవర్‌లోనే ఔట్ చేసిన పంజాబ్.. ఆ తర్వాత.. క్రిస్‌లిన్- ఉతప్ప జోడి దూకుడుగా ఆడటంతో భారీగా పరుగులు సమర్పించుకుంది. ఈ జోడి రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. ఉతప్ప ఔట్ అనంతరం వచ్చిన నితీశ్ రానా (3), ఆండ్రీ రసెల్ (10) నిరాశపరిచారు.

ఈ దశలో కెప్టెన్ కార్తీక్‌తో కలిసి స్కోరు బోర్డుని నడిపించిన క్రిస్‌లిన్ జట్టు స్కోరు 147 వద్ద ఔటవగా.. చివర్లో శుభమన్ గిల్ (14 నాటౌట్ : 8 బంతుల్లో 2×4)తో కలిసి నిలకడగా ఆడిన కార్తీక్ జట్టుకి మెరుగైన స్కోరు అందించాడు. పంజాబ్ బౌలర్లలో బరిందర్ శరణ్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

చివర్లో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కార్తీక్‌ 43(28 బంతులు, 6 ఫోర్లు‌) దాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే టామ్‌ కుర్రాన్‌(1) సైతం వికెట్‌ సమర్పించుకున్నాడు. అండర్‌-19 స్టార్‌ శుభ్‌మన్‌గిల్‌(14 నాటౌట్‌), పియూష్‌ చవ్లా(2 నాటౌట్‌)లుగా నిలిచారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -