టీమిండియా ధాటికి విండీస్ చిత్తు..!

- Advertisement -

వెస్టిండీస్ తో జరుగుతున్నా టి20 సిరీస్ తొలి మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఏకంగా 68 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట టాస్ ఒడి బ్యాటింగుకు దిగిన టీమిండియా..ఓపెనర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 24 పరుగులు ( 3 ఫోర్లు, ఒక సిక్స్ ) చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తరువాత క్రీజ్ లో కుదురుకున్న రోహిత్ విండీస్ బౌలర్లపై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. 145.45 స్టైక్ రేట్ తో 44 బంతుల్లో 64 పరుగులు ( 7ఫోర్లు, 2 సిక్సులు ) చేసి వెనుదిరిగాడు.

ఇక ఆ తరువాత రిషబ్ పంత్ ( 12 బంతుల్లో 14 పరుగులు ), రవీంద్ర జడేజా ( 13 బంతుల్లో 16 పరుగులు ) అశ్విన్ ( 10 బంతుల్లో 13 పరుగులు ) వంటి వారు పెద్దగా స్కోర్ సాధించనప్పటికి చివర్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. 215.79 స్టైక్ రేట్ తో 19 బంతుల్లో 41 పరుగులు ( 4ఫోర్లు, 2 సిక్సులు ) చేయడంతో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది.

- Advertisement -

ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన విండీస్ టిమ్ లక్ష్య ఛేదనలో తడబడింది. బ్రూక్స్ మాత్రమే 20 పరుగులు చేసి ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలవగా, మాయెర్స్ 15 పరుగులు, పురన్ 18 పరుగులు, పాల్ 19 పరుగులు చేశారు.. ఇంకా మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా కూడా చాలా తక్కువ స్కోర్ కె పరిమితం అయ్యారు. దీంతో విండీస్ జట్టు 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూడగా, టీమిండియా 68 పరుగుల తేడాతో మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా దినేష్ కార్తీక్ నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -