Sunday, May 5, 2024
- Advertisement -

బీసీసీఐకి క్షమాపనలు చెప్పిన దినేష్ కార్తిక్

- Advertisement -

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించడంపై భారత సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ‘బేషరతుగా క్షమాపణలు’ చెప్పారు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ అయిన కార్తీక్‌ కరేబియన్ లీగ్ లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (టీకేఆర్) జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవడంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నవీడియోలు బయలకు రావడంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది. దీంతో వివరణ ఇవ్వాలని దినేష్ కార్తిక్ కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది.

నోటీసుల్లో కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వివరణ సైతం కోరింది. ఈ నోటీసులపై కార్తీక్ ఆదివారం స్పందించాడు. బీసీసీఐకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. సరైన అనుమతి తీసుకోకుండా ఇలా చేసినందుకు బీసీసీఐకి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా.ఇక నుంచి టీకేఆర్ జట్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనను. అలాగే జట్టులో ఎలాంటి బాధ్యత వహించను అని బీసీసీఐకు రాసిన లేఖలో కార్తీక్ పేర్కొన్నాడు

ట్రిన్‌బాగో జట్టు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ది కావడం.. అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌లో దినేశ్‌ కార్తీక్‌ సారథిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -