Friday, May 17, 2024
- Advertisement -

జస్టిస్‌ లోధా కమిటీ నివేదిక క్రికెట్‌ను సర్వ నాశనం చేసింది…శ‌ర‌ద్‌ప‌వార్‌

- Advertisement -

బీసీసీఐలో పాల‌నా సంస్కరణ‌ల కోసం జస్టిస్‌ లోధా కమిటీ నివేదిక ఇచ్చిన నేప‌థ్యంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. లోధాక‌మిటీ సిఫార్సుల‌పైన బీసీసీఐ మండిప‌డుతోంది. తాజాగా ఎన్‌సీపీ అధినేత, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ జస్టిస్‌ లోధా కమిటీ నివేదికపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది క్రికెట్‌ను సర్వ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్య‌తో ఆయ‌న‌కు ఈ నివేదిక‌ మీద ఎంత‌గా అసంతృప్తి ఉందో తెలిసిపోతోంది.

గ‌తంలో బీసీసీఐలో ప్ర‌క్షాల‌న‌కోసం లోధాక‌మిటీ ఏర్పాట‌య్యింది. ఈ క‌మిటీ షిపారుసుల‌ను క్రికెట్ బోర్డులో అమ‌లు చేయ‌డానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. బీసీసీఐ బోర్డులో మంత్రులు సభ్యులుగా ఉండకూడదని స్పష్టం చేసింది. బోర్టులో సభ్యుల వయసు 70 ఏళ్లకు మించవద్దన్న నిబంధనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

తాజాగా విలేకరులు లోధా సిఫార్సులపై అడిగిన ప్రశ్నకు గాను శ‌ర‌ద్ ప‌వార్ ఈ విధంగా స‌మాధానం ఇచ్చారు. ఐపీఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌పై జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఇవ్వ‌డంతో బీసీసీఐలో సంస్కరణల కోసం 2015 జనవరిలో సుప్రీం కోర్టు జస్టిస్‌ లోధా కమిటీని నియమించగా, లోధా క‌మిటి నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక‌ను సుప్రీంకోర్టు ఆమోదించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -